kavitha enters the fray with a new party KCR, KTR in shock..?

తెలంగాణ లో మరో కొత్త పార్టీ.. మే 1నే కవిత కొత్త పార్టీ ప్రకటన.. షాక్ లో కేసీఆర్, కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చిట్‌ చాట్‌లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత.. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషాలు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తన సొంత పార్టీ నుంచి ఎక్కడ నుంచి పోటి చేస్తానని కూడా చెప్పేసింది మల్లా. మరి పార్టీ ఎప్పుడు పెట్టనుంది.. స్థానం నుంచి కవిత పోటి చేయనుంది అనేది తెలుసుకుందాం రండి.

ఇక విషయంలోకి వెళ్తే..

తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ బహిష్కరణ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు సొంత బాటను ఎంచుకున్నారు. తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత కీలక క్లారిటీ ఇచ్చారు.

కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్..

ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు హద్దు దాటి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు. జాతిని, నేతలను అవమానించేలా చేసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌కు అంటూ ఒక పుస్తకమే ఉంటుందని.. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. అలా అంటునే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజాని దగ్గరగా ఒక పార్టీని పుట్టించాలని.. అందుకు తానే నాయత్వం వహించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని మే నెలలో ప్రకటన ఉంటుందని. ఆ కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు వెల్లడించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఇక కవిత పార్టీలో అంటే… మ పార్టీ పేరులో ఖచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు తన పార్టీ తరఫునే 2028 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించేశారు. ఇక ఆ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచైనా పోటీ చేయోచ్చు అని తెలిపారు. ఇక ముందుగా తన ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట, సెకండ్ ఛాయిస్ బోధన్ అని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని సమాచారం. ఒకే కుటుంబంలో రెండు పార్టీలు ఉంటే ప్రజలు ఆ పార్టీలను ఎలా స్వాగతిస్తారు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత తొలి డిమాండ్ ఇదే..!

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని.. దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక ఒకానొక సందర్భంలో స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని… అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఈ నెల 24న చలో సెక్రటేరియట్‌..

బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేసిన అంశాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తు చేశారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోవడం శోచనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *