Katrina Kaif gives birth to a healthy baby boy..!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ కత్రినాకైఫ్‌ (Katrina Kaif)-విక్కీ కౌషల్‌ (Vicky Kaushal) గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెండ్లైన నాలుగేండ్లకు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ స్టార్‌ జంట సోషల్‌ మీడియా ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కత్రినా కైఫ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. మా సంతోషాల మూట వచ్చేసింది. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా మగ బిడ్డకు స్వాగతం పలుకుతున్నాము అని వెల్లడించారు. ఈ శుభవార్తతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వారికి అభినందనలు వెల్లువెత్తించారు.

విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్.. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కత్రినా తల్లి కానున్నట్లు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఈ జంట 2025 సెప్టెంబర్ 23సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కత్రినా గర్భవతి అయినట్లు ప్రకటించారు. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కత్రినా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం’ అంటూ ప్రకటించింది. ఇప్పుడు పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు.. కత్రినా-విక్కీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *