Kantara hero Rishab Shetty in Pan India star hero NTR's Dragon movie

యాంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR తర్వాత అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. దేవ‌ర‌1తో మంచి స‌క్సెస్ అందుకున్న ఎన్టీఆర్, రీసెంట్ గా వార్2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వార్2 సినిమాకు ఆశించిన ఫ‌లితం రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా కర్ణాటకలోనే జరుగుతుంది.

ఇక విషయంలోకి వెళ్తే..

క‌ర్ణాట‌క‌లో తార‌క్ కు ఫ్యాన్స్ కాగా ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా కెజిఎఫ్, స‌లార్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ‌గా క‌ర్ణాట‌క‌లోనే జ‌రుగుతుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కు దేశం మొత్తం ఫ్యాన్స్ ఏర్ప‌డ‌గా, క‌ర్ణాట‌క‌లో అత‌నికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. తార‌క్ కు క‌న్న‌డ మూలాలు కూడా ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న క‌న్న‌డ‌లో కూడా తెలుగులో లాగానే అద్భుతంగా మాట్లాడ‌గ‌ల‌రు. డ్రాగ‌న్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో క‌న్న‌డ ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌వాల‌ని ఎన్టీఆర్ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ క‌న్న‌డ స్టార్ ను న‌టింప‌చేయాల‌ని చూస్తున్నార‌ట తార‌క్. ఆ హీరో మ‌రెవ‌రో కాదు, కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిష‌బ్ శెట్టి. ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీలో రిషబ్ శెట్టి ఓ గెస్ట్ రోల్ చేయ‌నున్నార‌ని శాండిల్‌వుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఎన్టీఆర్ తో రిష‌బ్ కు ఫ్రెండ్‌షిప్ ఈ మూవీలో ఓ స్పెష‌ల్ రోల్ ఉంద‌ని, ఆ రోల్ కోసం ప్ర‌శాంత్ నీల్, రిష‌బ్ శెట్టిని సంప్ర‌దించార‌ని, ఫ్లాష్ బ్యాక్ లో రిష‌బ్ శెట్టి క‌నిపించ‌నున్నార‌ని అంటున్నారు. ఎన్టీఆర్ తో త‌న‌కున్న ఫ్రెండ్‌షిప్ కార‌ణంగా రిషబ్ కూడా ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి డ్రాగ‌న్ స్క్రిప్ట్ ను ప్ర‌శాంత్ నీల్ చాలా కొత్త‌గా రాసుకున్నార‌ని తెలుస్తోంది. దీంతో తారక్ – నీల్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

NTR కెరీర్ లోనే బెస్ట్ మూవీ..

ఇక ఈ ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంతార చాప్టర్ 3 లో తారక్..

ఇదిలా ఉంటే.. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్‌కి త‌మ సినిమాలను తీసుకెళ్లడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కాంతార 1 లో తన మిత్రుడు ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇలా ఉండగా.. ‘కాంతార 3’లో ప్రత్యేకమైన కాంబోని సెట్ చేస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈ క్ర‌మంలో కాంతార‌3లో జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక ఫుల్ లెంత్ పాత్రను రెడీ చేస్తున్నాట్లు సమాచారం. ఇదే నిజ‌మైతే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ. అంతేకాదు ఇండియన్ సినిమా స్థాయిలో ఓ బ్లాక్‌బస్టర్ అప్‌డేట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. రిషబ్ శెట్టి కథలకు, ఎన్టీఆర్ యాక్షన్, ప్రెజెన్స్‌కు క్రేజీ ఫాలోయింగ్ ఉన్నందున ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరుగుతాయి. ఇలా ఇద్దరి ఫ్రెండ్స్ సినిమాల్లో కూడా కలిసి రావడం.. అటూ రిషబ్ శెట్టి ఫ్యాన్స్ కి ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్లే అయ్యింది. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *