డేంజర్ లో జూరాల …
తెలంగాణలో (Telangana) మరో ప్రాజెక్టు డేంజర్ జోన్ ఉంది. అదేదో కాదు మహబూబ్ నగర్ లో (Mahabubnagar) ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project). అవును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెంజర్ జోన్ లో కొట్టు మిట్టాడుతుంది. పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం కృష్ణ నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఇక ఆ జల ప్రవాహం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పోటెత్తడంతో.. జలాశయం నిండుకుండలా మారింది. నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయింది. దీంతో డ్యాం సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
కృష్ణా నది వరదను జూరాల తట్టుకోలేకపోతుందా..?

కర్ణాటక (Karnataka), మహారాష్ట్రలో గత వారం రోజులు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కర్ణాటకలో కృష్ణ నదిపై ఉన్న అతి పెద్ద డ్యాం అయిన అల్మట్టి లో రికార్డు స్థాయిలో వరద వృధ్రితి ఉండటంతో… ఆ వరత అంత కూడా కర్ణాటక ప్రభుత్వం జూరాలకు విడుదల చేసింది. దీంతో జూరాల సైతం నిండు కుండాల తలపించడంతో ఆ నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేయనుంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన ప్రవాహాన్ని కృష్ణ నదిలోకి వదులుతున్న విషయం తెలిసిందే.
జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏంటి..?

తాజాగా మరోసారి భారీగా వరద పెరగడంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిపోయింది. తాజాగా గేట్లను ఎత్తే సమయంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయింది. అలాగే 12, 16 గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇదే కాకుండా.. 24,26,30,55 గేట్ల రోప్ లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో లూస్ అయిన రోప్ లను ఎత్తితే గేట్లు తెగిపోయ ప్రమాదం ఉండటంతో జూరాలా డ్యాం అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక అయితే గేట్ రోప్ తెగిపోయిందని స్థానిక ప్రజలకు సమాచారం అందడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోన్న భయాందోళనలో స్థానిక, జూరాల ఆయకట్టు ప్రజలు ఉన్నారు.
ఎంత నీరు ఉందంటే…?
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఆదివారం సాయంత్రం 3 స్పిల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటి మట్టం 318.130 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థం 9.657 టిఎంసిలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 8.869 టిఎంసిలుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 53 వేల క్యూసెక్కులు నమోదు కాగా దిగువకు శ్రీశైలం వైపు 12,303 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Suresh