Jubilee victory in Congress's election..? Naveen Yadav wins with a huge majority..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ రికార్డ్ స్థాయి విజయం సాధించడంతో గాంధీ భవన్ లో సంబరాలు అంబరాన్నంటాయి.

నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు..

అటూ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు ఘనంగా షూరు అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గాంధీ భవన్ లో రప్పా రప్పా…

మరోవైపు.. గాంధీభవన్ లో కూడా విజయోత్సవాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతల స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

నవీన్ యాదవ్ ఇంటి వద్ద సంబరాలు..

యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు షూరు అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *