Stampede during Jagannath's chariot procession

గుజరాత్‌ (Gujarat) లోని గోల్‌వాడ దగ్గర జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

12వ శతాబ్దం చరిత్ర…

ప్రతి సంవత్సరం ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) లో జరిగే జగన్నాథ రథయాత్ర విశేష వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథినాడు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు (Jagannath), బలభద్రుడు (Balabhadruḍu), సుభద్రాదేవి (Subhadra) రథాలను లాగేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇక ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతలు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్​ 27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరీ జగన్నాథుని రథయాత్ర (Puri Jagannath’s chariot procession) అంగరంగ వైభవంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *