ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్ సిరప్ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2022లోనూ మన దేశం నుంచి ఎగుమతైన మందుల వల్ల గాంబియాలో డజనుకు పైగా పిల్లలు మరణించారు. అయినా వాటి నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఔషధ తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు అందరికీ ముప్పేనని విమర్శిస్తున్నారు. కాగా ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.

ఇక ఈ కేసులో, శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ సోని అక్రమంగా సిరప్ పంపిణీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. డాక్టర్ సోనిపై ఇండియన్ పీనల్ కోడ్ (INC) లోని 276, ఇండియన్ పీనల్ కోడ్ (INC) లోని 105, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని 27A సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఆ పిల్లలు మరణించడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. వారు నెల రోజులుగా అస్వస్థతకు లోనైనా అదే సిరప్ Prescribe చేసిన డాక్టర్ ప్రవీణ్‌ని ఇప్పటికే అరెస్టు చేసింది. ఇక కల్తీ జరిగిన సిరప్ బ్యాచ్ SR-13కి చెందింది. ఇది 2025 మేలో తయారు అయింది. 2027 ఏప్రిల్‌లో ఎక్స్‌పైర్ అవుతుంది. కాగా కల్తీ దగ్గు సిరప్ నమూనాలను పూణే, ముంబై, నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ల్యాబొరేటరీలు చేసిన పరీక్షలలో కోల్డ్రిఫ్ మాత్రమే కలుషితమైందని నిర్ధారించాయి. దీంతో డ్రగ్ కంపెనీపై కేసు పెట్టింది. మహారాష్ట్ర, తమిళనాడులో ఘటనలు చోటుచేసుకోగా ఆ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కాగా సిరప్ విషమయమని తనకు తెలియదని డాక్టర్ పేర్కొన్నారు. అరెస్టుపై MP డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.