Is the collapsed Brahmamgari Matam another disaster?

కాలజ్ఞానం మఠం కుప్పకూలింది..

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన పేరుతో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన స్వగ్రమం లోని బ్రహ్మంగారి మఠం కు వెళ్లని వాళ్లు సైతం ఉండరు. కడప జిల్లాలకు వెళ్తే.. ఆయన ఇంటికి వెళ్తే గానీ వాళ్లది తిరుగు ప్రయాణం కారు. అంతటి మహిమగల కాలజ్ఞానం సంపద గల వ్యక్తి నివాసం ఉన్న ఇల్లు ఇప్పుడు కూలిపోయింది. ఇటీవలే వచ్చిన మొంథా తుఫాన్ కారణంగా ఆయన నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మం వారి ఇల్లు ధ్వంసమైంది కానీ ఇప్పటి వరకు వాటిని పట్టించుకునే నాదుడే లేడు అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాల కారణంగా కూలిపోయిన చారిత్రక కట్టడం. పునర్‌నిర్మించాలని గ్రామ ప్రజలు కొరుతున్నారు.

ఆయన చెప్పిందే జరుగుతుందా..?

ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు విశేషాలు, ప్రమాధాలు.. చోటు చేసుకున్నా వెంటనే ఆ విపత్తులను బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పిందే అని.. ఇప్పుడు ఆయన చెప్పిందే జరిగింది అని ప్రజలు విశ్వసిస్తారు. అంటే బ్రహ్మం గారు.. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి సాక్షాత్తూ దైవ స్వ‌రూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి తన కాల‌జ్ఞానంలో వీటన్నిటిని ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ఈ సంవత్సరం జరిగే అనర్థాల గురించి కాలజ్ఞానంలో ఉన్నవి తెలిస్తే వెన్నులో వణుకుపుడుతుందని పండితులు చెబుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే…

400 ఏళ్లనాటి మఠం…

మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో.. కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ధ్వంసం అయింది. ఇటీవలే మొంథా తుఫాన్ ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాలు దాటికి దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి బ్రహ్మంగారి నివాసం కూలిపోవడంతో అయన భక్తులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాకు 75 కిలోమీటర్ల దూరంలో మైదుకూరుకు 28 కిమీ దూరంలో ఈ బ్రహ్మంగారి మఠం ఉంది. ఈ మఠం ఉన్న గ్రామాన్ని 17వ శతాబ్దంలో కందిమల్లయ్య పల్లెగా పిలిచే వారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ మఠం ఏర్పాటు చేయడంతోపాటు జీవ సమాధి కూడా ఇక్కడే చెందడంతో ఆ గ్రామం పేరు బ్రహ్మంగారి మఠంగా మారిపోయింది. ఆయన ఏర్పాటు చేసిన ఈ ఇల్లు 400 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. సామాన్య శకం అంటే 1608 నుంచి 1693 వరకూ ఆయన జీవించినట్టు అక్కడి స్థల పురాణం కూడా చెబుతుంది.

1693లో జీవ సమాధి గాంచిన వీరబ్రహ్మేంద్రస్వామి..

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆ గ్రామంలోనే 1693లో జీవసమాధి అయినారు. దీంతో ఆ ప్రాంతంలో దేవాలయం నిర్మించి మఠమును ఏర్పాటు చేశారు. మఠంగా ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా మఠానికి మఠాధిపతులుగా వారి కుటుంబ సభ్యులే ఉంటూ వస్తున్నారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం ఏడవతరం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న పరమపదించారు. అంటే 11 తరాలుగా ఆ వంశం వారే బ్రహ్మంగారిమఠానికి అధిపతులుగా ఉంటున్నారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి చనిపోయేనాటికి 52 సంవత్సరాలు పీఠాధిపతిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉన్న 12వ పీఠాధిపతి విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉంది. దానితో బ్రహ్మంగారి నివాసం అభివృద్ధి ఫై వారు దృష్టి పెట్టలేదనే విమర్శ భక్తుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.
ఇక వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన “కాలజ్ఞానం” తెలుగు ప్రజల దృష్టిలో చాలా విలువైన భవిష్యవాణి.

ఇంకెందుకు వారసులు..?

మెుంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి పురాతనమైన ఇల్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భారీ వర్షాలతో బ్రహ్మంగారి మఠంలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రహ్మంగారి నివాసం చాలా పాత కట్టడం కావడంతో కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. 400 ఏళ్ల నాటి కట్టడం వర్షాలకు నాని పడిపోయిందని వారు చెబుతుండగా భక్తులు మాత్రం వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఇలా పడిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. పీఠాధిపతి కోసం పోటీపడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకోవడంలో విఫలం అయ్యారని గ్రామ ప్రజలు ధ్వజమెత్తారు. ఇదేనా మీ వారసత్వం అని నిలదీశారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి గృహాన్ని కాపాడుకోలేని వారు ఆయన వారసత్వం ఎలా కాపాడతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇల్లు కూలిపోవడం అరిష్టం…

భారీ వర్షాల కారణంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయిన బ్రహ్మంగారి నివాస పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతీ భక్తులు స్వామివారి నివాస గృహాన్ని సందర్శిచే వారని గుర్తు చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని… ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పడం కాదని ఇకనైనా బ్రహ్మంగారి మఠంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని, అధికారుల అలసత్వం కారణంగా నివాస గృహం కూలిందని భక్తుల ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పటికైనా.. ఆయన జ్ఞాపకంగా నిలిచిన ఇంటిని తిరిగి బాగు చేస్తారో లేదో చూడాలని స్థానికులు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *