Is she responsible for the Nepal riots? The 11-year-old girl who brought down the government!
  • నివురుగప్పిన నిప్పులా నేపాల్..
  • హిమాలయ దేశంలో.. హింసాత్మక ఘటనలు..
  • 3 దశాబ్దాల అవినీతి.. జల్సాల్లో ఊరేగుతున్న నాయకులు పిల్లలు
  • హింసాత్మకంగా మారిన జెన్ – జి ఆందోళనలు
  • సోషల్ మీడియాపై బ్యాన్ పై విద్యార్థులు, యువత ఆగ్రహం..
  • SM వేధికగా.. నేపాల్ సర్కార్ పై యువత ప్రశ్నల వర్షం
  • అవినీతిని తగ్గించి ఉద్యోగాలు ఇవ్వాలని కదం తొక్కిన నేపాల్ యువత
  • ఆందోళన కారులపై కాల్పులు జరిపిన నేపాల్ ఆర్మీ
  • 12 ఏళ్ల విద్యార్థి తలపై బుల్లెట్ల వర్షం కురిపించిన భద్రత దళాలు
  • బారి గేట్లుపై ఏరులై పారిన బాలుడి రక్తం

భారత్ పొరుగు దేశం నేపాల్ లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. ఈ యాప్స్ కంటెంట్ రూల్స్‌ని పాటించలేదనీ, నిబంధనలకు పాతరేశాయని ప్రభుత్వం తెలిపింది. అందుకే నిషేధించినట్లు చెప్పింది. ఐతే.. ఈ చర్యను యువత భరించలేకపోయారు. తమ స్వేచ్ఛని ప్రభుత్వం హరించేసింది అని భావించారు. అలా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కానీ అది తప్పు. నిజానికి అక్కడి యువత ఆగ్రహం కు గురి చేసిన అశం ఆ సోషల్ మీడియా యాప్స్ కానే కావు. భారత్ తో సహా ప్రపంచం మొత్తం కూడా నేపాల్‌లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉందనే విషయం మీకు తెలుసా ? మూడు దశాబ్దాల పాటు అవినితి ఉందని తెలుసా..? నేపాల్ రాజ్యంగం మార్చాలని డిమాండ్ ఉందని తెలుసా..? నేపాల్ యువకులు నిరుద్యోగంతోనే వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది అని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే. నిజంగా నేపాల్ లో అశాంతి నెలకొన్నడానికి ప్రధాన కారణం ఓ 11 ఏళ్ల బాలిక. మరి ఆ బాలిక ఏం చేసింది. అసలు ఆ బాలిక ఎవరు.. 11 ఏళ్ల బాలిక దేశాని నివురుకప్పిన నిప్పులా మార్చిందా.. అసలేంటీ ఆ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఇక విషయంలోకి వెళ్తే..

నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్‌ జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అలాగే పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 22 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. చివరికి కేపీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అలాగే పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది. అక్కడి ఆర్థిక మంత్రిని ఆందోళన కారులు బట్టలు విప్పి మరీ కొట్టారు.

జనరేషన్ Z యువత ఆగ్రహం..

కానీ ఇక్కడ అందరికీ సోషల్ మీడియా బ్యాన్ వల్లే జనరేషన్ Z యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉంది. ఇంతకీ నేపాల్ లో ఆ 11 ఏళ్ల యువతి ఏం చేసింది.. లేదా ఆ యువతికి ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ప్రారంభంలో ఓ 11 బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడింది. ఆ యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా.. అదే సమయంలో ఓ మంత్రి ప్రభుత్వ వాహనం ఆ బాలికను ఢీకొంది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. కనీసం ఆ బాలికకు ఏం జరిగింది అని చూడకుండా ఆ బాలికను వదిలేసి.. కారు దూసుకెళ్లింది. ఆ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ కారు డ్రైవర్‌ను పట్టుకోని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరో పక్క బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్న మంత్రి డ్రైవర్‌ను ఎలాంటి కేసు లేకుండా కేవలం 24 గంటల్లోనే విడుదల చేశారు. ఎందుకు విడుదల చేశారు అంటే.. తిరిగి పోలీసులు స్థానికులపై మండిపడ్డారు. ఇది అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

ఎందుకంతా ఈ రాద్ధాంతం – కేపీ శర్మ

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ఇదొక చిన్న సంఘటన అంటూ కొట్టిపారేశారు. దీనికి కూడా ఇంత రాద్ధాంతం చేయాలా అన్నట్లుగా మాట్లాడారు. స్వయంగా ప్రధానే ఆ మాటలు మాట్లాడటంతో అది వాళ్ళను మరింత రెచ్చగొట్టింది. దీంతో ప్రభుత్వం పై యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక ప్రత్యేక్షంగా ప్రభుత్వం పై నిరసనగా.. సోషల్ మీడియాలో బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ బాలిక రోడ్డుపై గాయపడిందని, కానీ ప్రభుత్వ కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. JusticeForTheGirl అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్టులు వైరలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పటికే నిరుద్యోగం, అవినీతి వల్ల అక్కడి ప్రజలు నేపాల్‌ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. అయితే బాలికకు జరిగిన ఘటన వాళ్లని మరింత ఆగ్రహానికి గురిచేసింది.

3 దశాబ్దాల అవినితి పాలన

దీంతో నేపాల్ లో గత 30 సంవత్సరాలుగు జరుగుతున్న అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి నిలదీశారు. దీంతో జనరేషన్ Z యువత కేంద్ర ప్రభుత్వానికి.. పలు డిమాండ్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న హౌజ్​ ఆఫ్​ రిప్రెజెంటేటివ్స్​ను వెంటనే రద్దు చేయాలి. పౌరులు, యువత, నిపుణులు భాగస్వామ్యంతో రాజ్యాంగంలో సవరణలు లేదా పూర్తిగా మార్చాలి. మధ్యంతర అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. నిష్పాక్షిక వైఖరిలో పారదర్శకంగా ఎన్నికలు జరపాలి. మూడు దశాబ్దాలుగా దోచుకున్న సొమ్ముపై దర్యాప్తు చేయాలి. విద్యా, వైద్యం, న్యాయం, భద్రత, కమ్యూనికేషన్లు లాంటి కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలి. అని డిమాండ్లు పెట్టారు.

సెప్టెంబర్‌ 4న..

దీంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ 4న సోషల్‌ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం యువతలో మరింత ఆగ్రహానికి తెరలేపింది. దీంతో సెప్టెంబర్‌ 8న రాజధాని కాట్మాండుతో పాటు తదితర ప్రాంతాల్లో యువత జనరేషన్ Z పేరుతో నిరసనలు చేశాయి. పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌లు, వాటర్‌ కెనన్‌లు ప్రయోగించారు. సెప్టెంబర్ 8వ తేదిన జరగిని ఆందోళనలో ఓ స్కూల్ స్టూడేంట్ ఆ నిరసన లో పాల్గొన్నారు.

విద్యార్ధులపై బుల్లెట్ల వర్షం..

దీంతో పోలీసులు ఆ విద్యార్థి తలకు నేరుగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ విద్యార్థి అక్కడే ఉన్న బారికేట్లపై పడి తల నుంచి రక్తం వరదల పారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలను నేపాల్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో నేపాల్ యువత తగ్గేదే లేదని.. ఆర్మీ వాళ్లపైకి దూసుకొచ్చారు. దీంతో ఆ దేశ ఆర్మీ ఏం చేయలేక.. యువత పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. దాదాపు 25 మంది మరణించారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, అక్కడి మంత్రుల నివాసాలకు యువత నిప్పు పెట్టింది. ఎంతలా అంటే.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను సైతం అక్కడి యువత సజీవ దహనం చేశారు అంటే అర్థం చేసుకోండి.. అక్కడి ప్రజలు ఎంత కొపంగా ఉన్నారో. దీంతో ఏం చేయలేక.. నేపాల్ ఆర్మీ సూచన మేరకు.. ప్రధాని తన పదవికి రాజీనామ చేసి దేశం విడిచి దూబాయ్ పారిపోయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఓలి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఇక ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ప్రభుత్వ అధికారాలను తమ చేతుల్లోకి తీసుకుంది. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు సంయమనం పాటించాలని సూచనలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *