చైనా వాటర్ బాంబ్..
China Dam : భారత్‌పై వాటర్ బాంబ్ ప్రయోగించే లక్ష్యంతో చైనా (China) కుయుక్తులు పన్నుతోంది. బ్రహ్మపుత్ర (Brahmaputra) నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యామ్ పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్ర నదిపై.. చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుండటం భారత్ (India) తో పాటు బంగ్లాదేశ్ (Bangladesh) పై ప్రభావం పడనుంది. నీటి ఒప్పందాలను ఉల్లంఘించి.. డ్రాగన్ చేస్తున్న ఈ డ్యామ్ నిర్మాణం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గడంలేదు. ఇక తాజాగా చైనా వాటర్ బాంబ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక విషయంలోకి వెళ్తే..

భారత్తో సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు కు (Hydro Power Project) సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి విడుదల చేసింది. ఇక తాజాగా చైనా ఈ పెద్ద ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాన్ని చైనా మీడియా విడుదల చేసింది. వాటర్ బాంబు గా (Water bomb) వివరించే ఈ వివాదాస్పద డ్యామ్ నిర్మాణం వల్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈనెల 19న మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లికి ప్రారంభోత్సవం చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను చైనా మీడియా విడుదల చేసింది. ఈ భారీ ప్రాజెక్టు పనులను ప్రారంభించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు.
యార్లంగ్ జాంగ్బో నది పైనే నిర్మాణం..

చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ జాంగ్బో (Yarlung Tsangpo) అని పిలుస్తారు. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై భారత్, బంగ్లాదేశ్ ఆదోళన చేస్తుంది. కారణం ఈ ప్రాజెక్టు ఈ రెండు దేశాల పైన నిర్మించడం. దీంతో భవిషత్యులో భారీ వరద సమయంలో గానీ, మరే ఇతర సమయంలో గానీ చైనా భారత్, బంగ్లాదేశ్ ను భయపెట్టే ప్రమాదం ఉంది. దీంతో ఈ డ్యాం నిర్మాణం పై ఈ రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
14 లక్షల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం..

ఇక ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ కంట్రీ దాదాపు 1.2 ట్రిలియన్లు అంటే భారత కరెన్సీలో 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. చైనా ఆసియా గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ సర్కారు ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యాములు ఉండనున్నాయి. టిబెట్లోని 90 నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతుంది. భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ టవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ కోర్సెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది ఆది నుంచి భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆందోళనలో భారత్, బంగ్లాదేశ్..

టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ ముల మలుపులో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. భారీ డ్యామ్ నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చని విమర్శలు ఉన్నాయి. దీని కారణంగా అరుణాచల్ తో పాటు రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళనను భారత్ వ్యక్తం చేస్తోంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుద భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబుగా పిలుస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్ బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది. భారత్లోనూ బ్రహ్మపుత్ర నది ప్రవాహం పై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది.