Iran's huge blow to India.. Petrol price suddenly increased to 200..?

Israel-US strike on Iran : భారత్ పై ఇరాన్ భారీ దెబ్బ.. ఒక్క సారిగా 200 కెళ్లిన పెట్రోల్ ధర..?

యుద్ద ప్రభావం.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు..

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదేంటి అక్కడేక్కడో యుద్దం జరిగితే మనకేంటి సంబంధం.. మనకేంటీ సమస్య అని అనుకుంటున్నారా.. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది. కానీ ఈ వార్త వింటే.. మీరు కూడా వామ్మో అని అనకతప్పదు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ యుద్ధ జ్వాలలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తాన్ని వణికించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆ దేశ రక్షణ మంత్రి మరణించారనే వార్తలు రావడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడులు దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు కూడా పాకాయి. ఈ గొడవ వల్ల మన దేశంపై పడే మొదటి దెబ్బ పెట్రోల్, డీజిల్ ధరలు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చుక్కలను చూస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్రోల్ కొట్టించాలంటే జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం.

ఇక విషయంలోకి వెళ్తే…

ఇరాన్ పై ఇజ్రాయెల్ – అమెరికా దాడులకు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సెగలు రేగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి లో నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 10 శాతం పెరిగి 81.87 డాలర్లకు చేరింది. ఆదివారం ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. గల్ఫ్ తీరంలో మూడు భారీ చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం, ఎల్‌ఎన్‌జీలో 20 శాతం వాటా కలిగిన హర్ముజ్ జలసంధి మూతపడటం గ్లోబల్ ఎకానమీకి పెను సవాలుగా మారింది.

40 దేశాలకు బిగ్ షాక్..!

ఇక భారత దేశం ప్రస్తుతం అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు 40కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన ముడి చమురు దిగుమతిని సర్దాబాటు చేసుకోవడానికి సహాయపడింది. అయితే, అమెరికా లేదంటే లాటిన్ అమెరికా నుంచి చమురు భారతదేశానికి చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. గల్ప్ నుంచి కేవలం ఐదు నుంచి ఆరు రోజుల్లో ముడి చమురు భారతదేశానికి చేరుతుంది. అదే అమెరికా, లాటిన్ అమెరికా నుంచి అయితే నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. దీనివల్ల మధ్యప్రాచ్య చమురు చౌకగా, రవాణా వేగంగా జరుగుతుంది.

హార్ముజ్ జల సంధి క్లోజ్..!

మధ్యప్రాచ్యంలో సంక్షోంభం ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 నుంచి 25శాతం వాటా కలిగిన హార్ముజ్ జల సంధి ద్వారా సరఫరాలకు ఆటంకం కలిగించవచ్చు. రష్యా చమురుపై ట్రంప్ ఆంక్షల మధ్య ఇటీవల కాలంలో హార్ముజ్ జలసంధి గుండా భారతదేశం చమురుకు ఎక్కువ మొత్తంలో రవాణా చేస్తోంది. కెప్లర్ నౌక ట్రాకింగ్ డేటా ప్రకారం.. భారతదేశం ముడి చమురు దిగుమతుల్లో రోజుకు దాదాపు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్లు జలసంధి ద్వారానే రవాణా ఉంటుంది. ఇది భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 50శాతం. ఈ చమురులో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి వస్తుంది. ఇరాన్ హార్మజ్ జలసంధిని మూసివేస్తే.. ప్రభావం భారతదేశంపై పడబోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వెంటనే ముగియకుంటే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉంటుంది. మరోవైపు.. ఇరాన్ కు భారతదేశం చేసే టీ ఎగుమతులు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2024 – 2025 సంవత్సరంలో భారతదేశం దాదాపు రూ.7బిలియన్ల విలువైన టీ ఎగుమతులను ఇరాన్ కు పంపించింది. మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి భారత దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి.

బాస్మతి బియ్యం పై ప్రభవం ఎంత..!

భారతదేశం నుంచి ఇరాన్ కు ఎగుమతి చేయబడిన బాస్మతి బియ్యం రవాణా ప్రస్తుతం రవాణాలో ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరానియన్ దిగుమతిదారులు ఈ బాస్మతి బియ్యాన్ని డెలివరీ చేయగలరా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఉద్రిక్తతలు కొనసాగితే.. మధ్య ఆసియా అంతటా బియ్యం ఎగుమతులపైనా ప్రభావంచూపుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం నుంచి భాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేసే దశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఆ రంగానికి చెందిన వారిలో ఆందోళన నెలకొంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పరుగులు తీయడం ప్రారంభించాయి. ఇంకొన్ని రోజులు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగితే భారతదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *