పాకిస్తాన్ కి భారత్ బిగ్ షాక్..! అప్పుడు సింధూ నది.. ఇప్పుడు రవి నది.. నీటిని ఆపేస్తున్న భారత ప్రభుత్వం.. ఇక పాక్ లో కరువే..!
చావు బతుకుల్లో భారత్ దాయాయి దేశం పాకిస్తాన్. భారత్ నీటి దెబ్బతో.. పాక్ లో ఆకలి కేకలు..! అవును మీరు విన్నది నిజమే.. ఇప్పటి నుంచి పాకిస్తాన్ లో ఆకలి కేకలే వినబడుతాయి. అందుకు కారణం ఉగ్రవాదం. ప్రస్తుతం.. చైనా, పాకిస్తాన్, భారత్ లను కలిపి ప్రవహించే నది సింధునది. పహల్గాం దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఈ కారణంగా భారత్..పాక్ కు సింధు జలాల ను ఆపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మోదీ ప్రకటంచారు. యుద్ధం ఆపేసినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించింది. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు పాక్ ను కట్టడి చేసే ఉద్దేశంతో సింధుజలాలను నిలిపేసింది.
ఇక విషయంలోకి వెళ్తే..
పాకిస్తాన్‌కు మరో షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే.. ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. “రావి” నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు “ఇండస్ వాటర్ ట్రిటీ”ని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్కు అసలు దెబ్బ తగలబోతోంది. దీనికి ముఖ్య కారణం.. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ – పాక్‌ల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా అనేక చర్యలను ప్రకటించింది. అలాగే ఆ తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో కొంతమేర నీటి సంక్షోభవంతో ఇబ్బంది పడుతున్న పాక్‌కు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్దమైంది.
మార్చి 31 నాటికి డ్యాం పూర్తి..!
ఇక భారత్ నుంచి పాక్‌లోకి ప్రవేశించే రావి నది జలాలను కూడా భారత్ త్వరలో నిలిపివేసే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో మావట్లాడుతూ… జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో నిర్మాణం అవుతున్న షాపూర్ కండి ప్రాజెక్టు మార్చి 31 నాటికి పూర్తవుతుందని చెప్పారు. షాపూర్ కండి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ముఖ్యంగా కథువా, సాంబా వంటి కరువు పీడిత ప్రాంతాలకు లబ్ది చేకూరనుందని చెప్పారు. రావి నది నుంచి పాకిస్తాన్‌కు నీటిని ఆపాలని అన్నారు. కథువా, సాంబా జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలు అని… ఈ ప్రాజెక్టు నుంచి వాటికి నీటిని తరలించాల్సి ఉందని చెప్పారు.
40 ఏళ్ల నాటి ప్రాజెక్టు..
ఇక షాపూర్ కండి బ్యారేజ్ విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్టుకు 1979లో ప్రణాళిక వేస్తే, 1982లో ఇందిగా గాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మోడీ ప్రభుత్వం 2018లో రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. మార్చి 31, 2026 నాటికి ఇది పూర్తవుతుంది. దీని ద్వారా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా చీనాబ్పై హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని, జీలం నదిపై వులార్ బ్యారేజ్ పనుల్ని భారత్ వేగంగా చేస్తోంది. దీని వల్ల పాక క్కు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. అంటే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన 45 ఏళ్ల క్రితం నాటిది అన్న మాటా. పంజాబ్, అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మధ్య 1979లో జరిగిన ఒప్పందం ప్రకారం. రంజిత్ సాగర్ (థీన్), షాపూర్ కండి ఆనకట్టలను నిర్మించాలని భావించింది. 2001లో ప్రణాళికా సంఘం ఈ ప్రాజెక్టును ఆమోదించింది. 2009లో సవరించిన వ్యయ అంచనాను ఆమోదించింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు పురోగతి సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే కేంద్రం, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య పలుమార్లు చర్చల తర్వాత 2018లో కొత్త ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగింది. ఇక, రావి నది నుంచి మిగులు నీటిని పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా, భారత్‌లోనే పూర్తి స్థాయిలో వినియోగించుకునే చూడటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంటే, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత… రావి నది మిగులు జలాలు పాకిస్తాన్‌కు విడుదల తగ్గనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పంజాబ్‌లోని సుమారు 5,000 హెక్టార్లకు, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లో 32,000 హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందనుంది. అలాగే పంజాబ్ ఈ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 206 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.