Husband commits suicide in Andhra Pradesh after wife fails to cook chicken

మన దేశంలో సాంప్రదాయంగా కుటుంబ సంబంధాలు, మానవ బంధాలు ఎంతో బలంగా ఉండేవి. చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకుని పరిష్కరించుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు మారాయి. క్లేశం – కోపం – ఆవేశం అనే త్రికోణంలో మనుషుల సహనశక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా యువత లో సహనానికి బదులుగా వెంటనే స్పందించాలని అలవాటు పెరుగుతోంది. ఫలితంగా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, అసహనాలు పుడుతున్నాయి. ఇప్పటి వరకు మనం పరిక్షల్లో ఫెల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఉంటాం.. పెళ్లి వద్దంటే ఆత్మహత్యలు, చివరికి కొత్త ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకోవడం చూసి ఉన్నాం గానీ.. ఇలాంటి ఆత్మహత్యలు మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఆత్మహత్యలు కూడా జరుగుతాయా అని మీకే డౌట్ వస్తుంది మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.

ఇక విషయంలోకి వెళ్తే..

ప్రస్తుత కలియుగంలో ఆ నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా.. శ్రీ బ్రహ్మం గారు పొతులురి బ్రహ్మ గారు చెప్పినట్లుగా కలియగం లో జరగరాని అనర్థాలు జరుగుతున్నాయి. మానవ బంధాలు నానాటికీ మసకబారుతున్నాయి. చిన్న కారణానికే అపర్ధాలతో మొదలై ఆత్మహత్యలతో సమస్యకు ముగింపు పలుకుతుంది నేటి యువత. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఆదివారం పూట చికెన్‌ వండాలని భార్యను మురిపెంగా కోరాడు. కానీ భార్య మాత్రం పంతంతో భర్తకు పచ్చడి మెతుకులు వేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై పి.చౌడయ్య తెల్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నదనదని ఇళ్ల లక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్‌ తినాలని ఉందని భార్యకు చెప్పినా ఆమె చికెన్‌ వండలేదు. దీంతో భర్త లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురయ్యాడు. అంతే.. పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పి.చౌడయ్య మీడియాకు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *