గత కొన్ని రోజులుగా ప్రపంచంలో ఎక్కడ చూసిన ప్రకృతి విపత్తులే (Natural disasters) సంభవిస్తున్నాయి. ఒక వైపు వరదులు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, దానికి తోడు సునామీ (Tsunami) హెచ్చరికలు.. ఇలా ఒకటా రెండా.. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటీవలే రష్యాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో సారి భూకంపం సంభవించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ (Drake Passage) ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం 8.0 తీవ్రతతో నమోదైంది. ఈ ప్రాంతం మహాసముద్రాలను కలిపే విశాలమైన సముద్ర మార్గం. USGS ప్రకారం దక్షిణ అమెరికా- అంటార్కిటికా మధ్య చిలీ సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 2:16 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు.. భూమి లోపల 10.8 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇప్పటి వరకు యుఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
గతంలో అమెరికాలో 8.0, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. నివేదికలను పరిశీలిస్తే అలాస్కాలో అత్యధికంగా 8.0 నుండి 9 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. దీని తరువాత భారీ సునామీ కూడా కనిపించింది. ఈ తీవ్రతతో భూకంపం సునామీకి, భవనాలు, వంతెనల కూలిపోవడానికి కారణమవుతుంది. అలాగే విమాన సేవలతో సహా అనేక ముఖ్యమైన విషయాలు ప్రభావితమవుతాయి. అంతకు ముందు టర్కీలో అనేకసార్లు భూకంపాలు సంభవించాయి. ఆగస్టు 10న సంభవించిన భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. అనేక భవనాలు కూలిపోయాయి. చాలా మంది మరణించారు. అదే సమయంలో 8 తీవ్రతతో భూకంపం జపాన్‌ను తాకినప్పుడు.. అక్కడ సునామీ హెచ్చరిక జారీ చేశారు.