Hollywood first AI Tilly actress.. Do you know about this Tilly..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. AI సాంకేతిక కనిపిస్తుంది. వైద్య రంగంలో గానీ, విద్య రంగంలో గానీ, డ్రైవింగ్ లో అకరికి మీడియాలోకి కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగ ప్రవేశం చేసింది. ఇదే కాకుండా.. ఓ దేశంలో AI మంత్రి కూడా నియమించుకుంది ఏ ప్రభుత్వం. ఇలా ఎక్కడ చూసినా AI టెక్నాలజీ కనపడుతుంది. ఇప్పుడు AI కన్ను సినిమాలపై పడింది. ఇక ఇప్పుడిప్పుడే.. ఇండియన్‌ సినిమాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా కోసం కొన్ని సన్నివేశాలను రూపొందించడం, పాటలను సిద్ధం చేయడం లాంటివి మనం చూశాం. మొన్నామధ్య ఓ సినిమా క్లైమాక్స్‌ను కూడా మార్చేశారు. ఓ సినిమా కోసం ట్రైలర్‌ను సిద్ధం చేసి రిలీజ్‌ చేశారు అని కూడా చూశాం. కానీ ఇప్పుడు హాలీవుడ్‌లో ఏకంగా ఓ హీరోయిన్‌నే రూపొందించారు. లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఓ టెక్‌ సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో అద్భుతాలు సృష్టించొచ్చు అని టెక్నాలజీ నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. అయితే మంచికి వాడాల్సిన ఏఐని చెడుకు వాడి ఇబ్బందులు పెడుతున్న వారున్నారు. ఇలాంటి సమయంలో ఏఐతో ఓ మ్యాజిక్‌ చేసే ప్రయత్నం చేస్తోంది ఓ హాలీవుడ్‌ సంస్థ. లండన్‌కి చెందిన ఏఐ ప్రొడక్షన్స్‌ కంపెనీ పార్టికల్‌ 6.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో టిల్లీ నార్వుడ్‌ అనే ఏఐ యాక్టర్‌ను పరిచయం చేసింది. ఆ నటితో హాలీవుడ్‌ సినిమాల్లో సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఏజెంట్లతో చర్చలు ప్రారంభించింది. ఈ హాలీవుడ్‌ నటి టిల్లీ ప్రత్యేకత ఏంటా అనుకుంటున్నారా.. అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? టిల్లీ హైపర్‌ రియల్‌ ఏఐ నటి. త్వరలోనే టిల్లీ గొప్ప నటిగా మారబోతుందని ఈమె సృష్టికర్త, నిర్మాత, నటి అయిన ఎలైన్‌ వాన్‌ డెర్‌ వెల్డెన్‌ చెబుతున్నారు. ఈమె నిర్వహించే ఏఐ ప్రొడక్షన్‌ స్టూడియో- పార్టికల్‌ 6 తొలి సృష్టి టిల్లీ. ఏఐ కమిషనర్‌ కామెడీ స్కెచ్‌ వీడియోలో టిల్లీ కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇక ఈ మేరకు ఏఐ యాక్టర్‌ టాలెంట్‌ తెలిపేలా డెమో వీడియోలూ రూపొందించి మరీ బయటకు రిలీజ్‌ చేసింది. పార్టికల్‌ 6 సంస్థ ప్లానింగ్‌ వర్కౌటైతే ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్‌ స్టార్‌గా టిల్లీ నిలుస్తుంది. ఇదిలా ఉండగా హాలీవుడ్‌ నటుల నుండి మాత్రం ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి డిజిటల్‌ యాక్టర్ల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *