జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రచారం చివరి దశకు చేరటంతో హోరా హోరీగా నేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నివేదికలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ క షాక్ గా మారుతున్నాయి. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ లో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
ఇక విషయంలోకి వెళ్తే..
ఉత్తరాధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ హైదరాబాద్‌లో రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ (BRS) కీలక నేతల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మోతీనగర్‌లోని నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కీలక నేతల ఇంటిపై సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక జూబ్లీహిల్స్ లో ఆదివారం సాయంత్రంతో ప్రచారం పూర్తి కానుంది. చివరి దశకు చేరుకున్న ప్రచారం తో ప్రధాన పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్య నేతలు బరిలోకి దిగారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాటల యుద్దం కొనసాగుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్.. మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లో గెలుపు ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సర్వే నివేదికల ఆధారంగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూనే కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు.