న్యూఢిల్లీ : న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లో (Parliament) కాంగ్రెస్ ఎంపీల ఆందోళలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దీంతో సోమవారం ఆగస్ట్ 11 ఉదయం ప్రారంభమైన ఉభయ సభలు కాసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ లో బీహార్ ఓటర్ల జాబితా సంవరణపై చర్చ జరపాలన ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను అధికార పక్షం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా (Bihar Voter List) సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనని ఉభయ సభల్లోని ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. దీంతో నేడు లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2కి వాయిదా పడ్డాయి. ఇక దేశంలో ఎంతో కీలకమైన ఎస్ఐఆర్ (SIR)పై చర్చ ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. ఎన్నికల్లో, ఓటర్ల లిస్టుల్లో మోసాలకు వ్యతిరేకంగా సోమవారం ఇడియా బ్లాక్‌లోని పార్టీల ఎంపీలు మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ భవనం నుంచి.. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకూ ఈ మార్చ్ జరిపింది.
ఇక బీజేపీ (BJP) తో ఈసీ (EC) కుమ్మక్కైందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఓట్ల చోరీ జరుగుతుదంటూ కాంగ్రెస్ (Congress)అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ (Election Commission) కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని (India Alliance) 25 ప్రతిపక్ష పార్టీల నుంచి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొననున్నారు. అయితే, ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీల ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఇండియా కూటమి ర్యాలీలో ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) సైతం పాల్గొన్నారు. ఎంపీల ర్యాలీకి అనుమతి లేదంటూ.. పోలీసులు బారీగేట్లు పెట్టడంతో.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆ బారికేడ్లపై నుంచి దూకారు. దీంతో మహిళా ఎంపీలు సైతం బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో ఆందోళన ఉధృతంగా మారింది. ముందు జాగ్రత్తగా.. సంసద్ మార్గ్ ను ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఆ మార్గాన్ని బ్లాక్ చేసి ర్యాలీకి అనునమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు రాహుల్ గాందీ, ప్రియాక తో సహా కూటిమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సులో తరలించారు.
ఇక మరో వైపు బీజేపీ ఇండియా కూటమి ర్యాలీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.