Fish Venkat | టాలీవుడ్ (Tollywood ) సీనియర్ నటుడు (actor) ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్య మరింత విషమంగా అవ్వడంతో ఎవరైన ఆదుకోవాలని తన కూతురు స్రవంతి వీడియోకి టాలీవుడ్ నుంచి ప్రముఖులు స్పందిస్తున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే…
టాలీవుడ్ సీనియర్ కమిడియన్, విలన్ రోల్స్ (Villain roles) లో నటించిన ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్ (Gabbar Singh) ‘, ‘నాయక్’, ‘డీజే టిల్లు’, ‘ఆది’, ‘బన్నీ’, ‘డీ’, ‘రెడీ’, ‘కింగ్’, దిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యలు ఆయనను బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన రెండు కిడ్నీలు విఫలమైనట్లు, గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పైనే జీవిస్తున్నట్లు ఆయన కుమార్తె స్రవంతి కన్నీటిపర్యంతమయ్యారు.
గతంలో ఫిష్ వెంకట్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏపీ డిప్యూటి సీఎం (AP Deputy CM) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో… వెంటనే ఆపరేషన్ చేయ్యాలని వైద్యులు తెలిపారు. దీంతో వెంకట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. ఇందుకు సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఆమె మీడియా ద్వారా వేడుకున్నారు. దీంతో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి కూతురికి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చిందని ఆమె స్వయంగా తెలిపింది.
Suresh