Heavy rains in Himachal, 51 dead, 25 missing

హిమాలయపు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు (Landslide) విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

11 కుండపోత వర్షాలు.. నాలుగు వరదలు..

ఇక తాజా పరిస్థితిపై హిమాచల్ ప్రదేశ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 కుండపోత వర్షాలు, నాలుగు ఆకస్మిక వరదలు (Floods), ఒక భారీ కొండచరియ విరిగిపడిన ఘటన నమోదైనట్టు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం మండి జిల్లాలోనే సంభవించాయి. సోమవారం సాయంత్రం నుంచి మండిలో రికార్డు స్థాయిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జల ప్రళయానికి వందలాది రహదారులు కొట్టుకుపోగా, విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

వరదల వల్ల 103 మందికి పైగా..

ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన ఆకస్మిక వరదలకు దాదాపు 103 మంది గాయపడినట్లు రాష్ట్ర నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో 204 ఇళ్లు దెబ్బతిన్నట్లు నివేదించింది. ప్రజా మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం ఎక్కువగా ఉంది. ఇది రూ.283.39 కోట్లుగా అంచనా వేశారు. జిల్లా వారీగా పరిశీలిస్తే కాంగ్రాలో అత్యధికంగా 13 మంది మరణించారు, చంబాలో ఆరుగురు, కలులో నలుగురు చనిపోయారు. కిన్నౌర్, సిమ్లా (Shimla), ఉనా జిల్లాల్లో 2 నుండి 4 మరణాలు నమోదం సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో తక్కువ మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్తులు, పశువులను నష్టపోయారు. ప్రజా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ వరదల్లో 30 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. గల్లంతైన వారి కోసం పోలీసులు, హోం గార్డులు, సహాయక బృందాలు రాత్రింబవళ్లు గాలిస్తున్నాయని మండి జిల్లా డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగణ్ తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

మూతపడ్డ రాష్ట్రం..

ఇక రాష్ట్రవ్యాప్తంగా 406 రహదారులు మూతపడగా, వాటిలో 248 రోడ్లు మండి జిల్లాలోనే ఉన్నాయి. మండి జిల్లాలో 994 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక మండి జిల్లాలోని (Mandi District) ప్రధాన నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పాండో డ్యామ్ నీటిమట్టం 2,922 అడుగులకు చేరడంతో, లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఛండీగఢ్-మనాలి (Chandigarh-Manali) జాతీయ రహదారి పలుచోట్ల మూసుకుపోయింది. మరోవైపు, హమీర్‌పూర్‌లోని బల్లా గ్రామంలో బియాస్ నది ఉప్పొంగడంతో 30 మంది కూలీలతో సహా 51 మందిని సహాయక బృందాలు కాపాడాయి.

రుతుపవనాలు మొదలు..

రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 20 నుంచి రాష్ట్రానికి సుమారు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) తెలిపారు. ప్రజలు నదులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) బుధవారం కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. జూలై 5 వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *