తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కార విషయం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. దీంతో తప్పనిసరీ పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్ర స్తుతం ప్రభుత్వం నుంచి సుమారు రూ.1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల ఉచిత వైద్య సహాయం అందిస్తోంది. దాన్నే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తామే పేదలకు డబ్బులిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాయి. డబ్బులు కేంద్రానివి..పేరు మాత్రం రాష్ట్రానికి అన్నట్టుగా తయారయ్యాయి.
మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోషియేషన్ (టీఏఎన్ హెచ్ ఏ) ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్ హెచ్ ఏ’ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నిన్న ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 323 ప్రైవేటు నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య సీఈఓలను కలిశామన్నారు.
తమ సమస్యలకు పరిష్కారం దొరకపోవడంతో విధిలేక హాస్పిటల్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మా హాస్పిటల్స్ లో రూ. 140 కోట్ల బకాయిలు రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. అవి ఇంకా రిలీజ్ చేయలేదన్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి రూ. 1400 కోట్లకు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ బాకాయిలు వసూళైతేనే డాక్టర్లకు, నర్సులు సహా హాస్పిటల్ లో నిర్వహణలో పాల్గొనే హౌస్ కీపింగ్, సెక్యురిటీ సహా ఎంతో మెయింటెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అందులో తమకు మిగిలేది అతి తక్కువన్నారు. ఏది ఏమైనా ఆ నిధులను విడుదల చేస్తేనే తమకు మనుగడ సాధ్యం అంటూ తామున్న పరిస్థితులను మీడియాతో చెప్పుకొచ్చారు. హాస్పిటల్స్ ను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుతున్నాయన్నారు. మరి ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు.