Haven't updated your Aadhaar? This is your last chance.

ఆధార్… ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు అనేది ముఖ్యం. దేశంలో ఆధార్ కార్ ఉంటేనే వాళ్లను ఈ దేశ పౌరులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే చాలా మంది ఈ ఆధార్ కార్డ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అది సరిగ్గా అప్డేట్ చేసుకోకా, లేదంటే కొత్త ఆధార్ కార్డు తీసుకోవడంలో ఆ జాగ్రతగా ఉండటం ఇలా చాలానే జరుగుతుంటాయి. అలాంటి వాళ్లకే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) మరో సువర్ణ అవకాశం ఇచ్చింది. చాలా వరకు చాలా మంది ఆధార్ కార్డును అప్డేట్ చేయరు. ఎంతా అంటే 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఆ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోరు. దీంతో అలాంటి వాళ్లకోసమే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) ఆధార్‌ అప్‌డేషన్‌ ప్రాసెస్‌ను ఈజీ చేసింది. 2025 జూన్‌ 14 వరకు myAadhaar పోర్టల్‌ ద్వారా ఫ్రీగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం ఆధార్‌ కార్డులు తీసుకున్న వారు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అడ్రస్‌, పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను సరిచేసుకోవడానికి ఈ గడువును ఉపయోగించుకోవాలి.

ఈ నెల 14 వరకు గడువు…

ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించగా.. ఈసారి జూన్ 14 వరకు గడువు పొడిగించింది. పాత ఆధార్ కార్డ్ ఉంటే.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి.. 10 ఏళ్ల పాత ఆధార్ కార్డు అప్‌‌డేట్ చేయడం (UIDAI) తప్పనిసరి చేసింది.

  • ఆధార్‌లో ఏది ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు..?
  • ఏ తేదీలోగా అప్‌డేట్‌ చేయాలంటే..?
  • ఆధార్ కార్డు ఎలా అప్‌డేట్ చేయాలి..?

అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

మీ ఆధార్ కార్డులో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు. ఫింగర్ ఫ్రింట్, ఫోటో లేదా ఐరిస్ స్కాన్ల వంటి సర్వీసుల కోసం ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించి రూ. 50 రుసుము చెల్లించాలి. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసేందుకు చివరి తేదీ జూన్ 14, 2025. ఇప్పటికే, యూఐడీఏఐ (UIDAI) అనేకసార్లు తేదీని పొడిగించింది. మీకు రెండు వారాలకు పైగా సమయం ఉంది. ఈలోగా ఆధార్ సర్వీస్ సెంటర్‌ను విజిట్ చేసి మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.

అప్‌డేట్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే…?

ముందుగా… UIDAI అధికారిక వెబ్‌సైట్ (myAadhaar)పోర్టల్‌ను విజిట్ చేయాలి. ఆధార్ కార్డ్ లో అడ్రస్‌ మార్చడానికి myAadhaar పోర్టల్‌ (myaadhaar.uidai.gov.in)లో లాగిన్‌ కావాలి. ఆధార్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి, ‘సెండ్‌ OTP’పై క్లిక్‌ చేయాలి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTPతో లాగిన్‌ కావాలి. ‘డాక్యుమెంట్‌ అప్‌డేట్‌’ లేదా ‘అడ్రస్‌ అప్‌డేట్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. కొత్త అడ్రస్‌ వివరాలు నమోదు చేసి, వాలిడ్‌ PoA (రేషన్‌ కార్డ్‌, వోటర్‌ ID, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌) స్కాన్‌ కాపీ అప్‌లోడ్‌ చేయాలి. ఫైల్‌ సైజ్‌ 2MB కంటే తక్కువగా, JPEG/PNG/PDF ఫార్మాట్‌లో ఉండాలి. సబ్మిట్‌ చేస్తే 14 డిజిట్‌ URN జనరేట్‌ అవుతుంది. దీనితో స్టేటస్‌ ట్రాక్‌ చేయొచ్చు. అలా అప్డేట్ చేసిన తర్వాత… అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ సబ్మిట్‌ చేసి.. URNతో స్టేటస్‌ను myAadhaar పోర్టల్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ‘చెక్‌ అప్‌డేట్‌ స్టేటస్‌’ ఆప్షన్‌లో URN ఎంటర్‌ చేయాలి. అప్రూవల్‌ తర్వాత అప్‌డేట్‌ చేసిన e-Aadhaarను పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయాలి. e-Aadhaar ఒరిజినల్‌ కార్డుతో సమానంగా చెల్లుతుంది. సమస్యలు ఎదురైతే UIDAI టోల్‌-ఫ్రీ నంబర్‌ 1947కు కాల్‌ చేయాలి.

ఆన్‌లైన్‌ సౌకర్యం లేనివారు…

ఇక ఆన్‌లైన్‌ సౌకర్యం లేనివారు ఆధార్‌ సేవా కేంద్రం లేదా ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌లో అప్‌డేట్‌ చేయొచ్చు. సమీప సెంటర్‌ను భువన్‌ ఆధార్‌ పోర్టల్‌ (bhuvan.nrsc.gov.in) ద్వారా కనుగొనవచ్చు. ఆధార్‌ నంబర్‌, PoI, PoA ఒరిజినల్‌ డాక్యుమెంట్‌లతో సెంటర్‌కు వెళ్లాలి. ఫారమ్‌ నింపి, బయోమెట్రిక్‌ డేటా (ఫింగర్‌ప్రింట్స్‌, ఐరిస్‌) అవసరమైతే అప్‌డేట్‌ చేయాలి. రూ.50 ఫీజు చెల్లించి, URNతో అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ పొందాలి. బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ ఆఫ్‌లైన్‌లోనే సాధ్యం. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1,200 సేవా కేంద్రాలు ఉన్నాయి.

అప్డేట్ లేకుండా స్కీములు రానట్టే…!

ఇక ఆధార్‌ వివరాలు సరైనవిగా ఉంటే ప్రభుత్వ స్కీమ్‌లు, బ్యాంకింగ్‌, ట్రావెల్‌ సర్వీసెస్‌లో ఇబ్బందులు తగ్గుతాయి. పదేళ్ల క్రితం జారీ అయిన ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేయకపోతే సర్వీస్‌ డినయల్‌, ఫ్రాడ్‌ రిస్క్‌ పెరుగుతాయి. మైనర్‌లు 15 ఏళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరి. UIDAI నిబంధనల ప్రకారం.. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అప్‌డేట్‌ చేయాలి. సరైన వివరాలు ఆధార్‌ ఆధారిత ఆథెంటికేషన్‌ను ఈజీ చేస్తాయి.

SURESH

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *