Avatar 3 Trailer Out | హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ మొదటి రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన నేపథ్యంలో అవతార్ 3 కూడా తప్పక ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నారు.
విజువల్ వండర్..
ప్రపంచ విజువల్ వండర్.. సరికొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది అవతార్ సినిమా అనే చెప్పాలి. జేమ్స్ కామెరూన్.. తీసిన విజువల్ వండర్. ఇక ఇప్పటికే.. అవతార్ 1, అవతార్ 2 సినిమాలు రాగా.. ప్రస్తుతం మాటికి సీక్వెల్ గా.. మూడో సినిమా రాబోతుంది. ప్రపంచ దిగ్గజ, హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. తాజాగా మూడో సినిమా అయిన “అవతార్ 3 ఫైర్ అండ్ యాష్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఈ సారి సరికొత్త కథతో…
ఇక విషయంలోకి వెళ్తే.. థియేటర్‌లో సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లే సినిమాలు అవతార్. ఇప్పటికే విడుదలైన రెండు అవతార్ సిరీస్‌లు ప్రేక్షకుడిని నివ్వెరపరచడంతోపాటు సరికొత్త కథతో ఒక జాతి తమ ఉనికి కోసం చేస్తున్న పోరాటాన్ని అద్భుతంగా చూపించారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. హలీవుడ్‌తోపాటు అన్ని సినీ పరిశ్రమల్లో రికార్డులను తిరగరాసేలా అవతార్ సిరీస్ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ఈ క్రమంలోనే అవతార్ 3 విడుదలకు సిద్ధమవుతోంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరిట రూపొందిస్తున్నారు.
అగ్నీ నేపథ్యంలో.. “అవతార్ 3”
ఈ సినిమా మొత్తం ఈ సారి అగ్ని చూట్టు స్టోరీ తిరుగుతుంది. కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలని చాలా అద్భుతంగా చూపించారు. కొద్ది రోజుల క్రితం మూవీ విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న ‘వరంగ్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అగ్ని శక్తులతో కూడిన నెవీ గణానికి చెందిన వరంగ్ పాత్ర చాలా మిస్టీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు సినీ ప్రియులు భావించారు. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పార్ట్‌లో కొత్త విలన్లు తెరపైకి రానున్నారు. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. పండోరా గ్రహంపై అగ్ని నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరోసారి మాయా లోకంలోకి తీసుకెళ్లనుంది. తాజా గా ఈ ట్రైలర్ ను అవతార్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రపంచ వ్యాప్తంగా.. 160 భాషల్లో…
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా, భారీ స్థాయిలో 160కి పైగా భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో సహా బహుళ భాషల్లో ఈ విజువల్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించనుంది. చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, ‘అవతార్ 4’ ను 2029లో, ‘అవతార్ 5’ ను 2031 డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఈ రెండు భాగాలు కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, కథాపరంగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేలా ఉంటాయని దర్శకుడు తెలిపాడు. అవతార్ అభిమానులకు ఈ ట్రైలర్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచి, సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేసింది.