హర హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు తెరపడింది. ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కబోతుంది. నేటి నుంచి సరిగ్గా మరో మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా విధ్వంసం మొదులుకాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా పవన్ పవనాలు వీయనున్నాయి.
పునకాల్లో పవన్ ఫ్యాన్స్…
పవన్ ఫ్యాన్స్ (Pawan fans) కు గుడ్ న్యూస్. ఎప్పుడు ఎప్పుడు తమ అభిమాన హీరోని పెద్ద స్క్రీన్ పై చూసుకోవాలి అని వెటింగ్ చేస్తున్న పవన్ అభిమానులకు తెరపడింది. ఎట్టకేలకు థియేటర్లలో హరిహర వీరమల్లు (Harihara Veeramallu) రిలీజ్ కానుంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పట్టేలా.. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా.. అద్భుతమైన విజువల్స్ అదిరిపోయింది హరిహర వీరమల్లు ట్రైలర్. మూడే మూడు డైలాగ్స్ తో సినిమా కథను చెప్పేశారు మేకర్స్. అవును నిజంగా… మూడు డైలాగ్స్ తో పవన్ స్టోరీ అంతా చెప్పేశారు.
హిందువులు పన్ను కట్టాల్సిందేనా..?
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.. అంటూ మొఘలులను ఎదురించిన వీరుని కథే హరిహర వీరమల్లు కథ అని చెప్పేశారు. కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond) అంటూ పవన్ కి ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ అనే చెప్పాలి. పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ సైతం సినిమాపై అంచనాలను పెంచేశాయి. పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ.. పవన్ చెప్పిన డైలాగ్ విజిల్స్ వేసేలా ఉంది. అలాగే.. మన దేశ ప్రధాని మోదీ (Prime Minister Modi) పవన్ గురించి చెప్పిన ‘యే పవన్ నహీ ఆంధీ హై’ డైలాగ్ ను ట్రైలర్లో హైలెట్ చేశారు. విలన్ బాబీ డియోల్ చేత.. ఆంధీ వచ్చేసింది అంటూ ఎలివేషన్ ఇచ్చారు. ఔరంగజేబు (Aurangzeb) పాత్రలో బాబీ డియోల్ (Bobby Deol) ని పవర్ ఫుల్ గా చూపించారు. ఇక పీరియాడికల్ సెటప్ మాత్రం అదిరిపోయింది. నిర్మాత ఏఎం.రత్నం (A.M.Ratnam)పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ను మంచి పాత్ర పడినట్టుగా ఉంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం. కీరవాణి (M.M. Keeravani) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తంగా.. పవన్ ఫ్యాన్స్ కు మెప్పించేలా ఉంది ఈ ట్రైలర్. ఇక్కడితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుందో చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. మరి హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో తెలియాలంటే.. సినిమా విడుద అయ్యేంత వరకు వేట్ చేయ్యాల్సిందే. ఇక ఈ ట్రైలర్ లో 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం (Mughal Empire) ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
జూలై 24, 2025న వరల్డ్ వైడ్‌గా …
ఇక పాన్ ఇండియా (Pan India) లేవల్ లో జూలై 24, 2025న వరల్డ్ వైడ్‌గా ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించారు. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Suresh