Gulf country airspace closure

తమపై ఇరాన్ (Iran) చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) పెద్దఎత్తున దాడులు చేస్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో (West Asian countries) ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇక అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ (Trump) యుద్ధం (World War) ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం.. అలాంటిది ఏం లేదు అని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ దాడులు చేస్తున్న కారణంగా తమ గగనతలాలను మూసేశాయి.

ప్రతి దాడికి దిగిన ఇరాన్…

ఇరాన్ పై అమెరికా (America) దాడి చేయడంతో… అగ్రరాజ్యం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ దాడులు మొదలెట్టింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న నాలుగు యూఎస్ మిలటరీ బేస్ ల మీద ఇరాన్ దాడులు చేసింది. ఖతార్ తో పాటూ ఇరాక్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ లలో దాడి చేసిందని అంతర్జీతీయ మీడియా తెలిపింది. ఖతార్ రాజధానిలోని దోహాలో పేలుళ్ళు కనిపించాయి. దీంతో ఖతార్ తో సహా గల్ఫ్ కంట్రీస్ అన్నీ తమ గగనతలాలన్నీ మూసేసామని ప్రకటించాయి. దీంతో ఖతార్, ఇతిహాద్, ఎమిరేట్స్ లాంటివన్నీ తమ ఫ్లైట్లను క్యాన్సిల్ చేస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఈ సర్వీసులన్నీ రద్దవుతున్నాయి. అయితే ఖతార్ మాత్రం తమ గగనతలాన్ని మళ్ళీ తెరిచామని ప్రకటించింది. కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పింది.

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

ఇరాన్ భీకర దాడుల కారణంగా… మడిల్ ఈస్ట్ లో ఎయిర్ ఇండియా (Air India) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌ ప్రాంతం నుంచి వెళ్లే తమ అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలోని కంట్రీస్, నార్త్ అమెరికా లోని పలు ప్రాంతాలు, యూరప్‌ కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కాస్త ప్రశాంతత వచ్చే వరకు, తదుపరి ఆర్డర్లు ఇచ్చేవరకు విమాన సర్వీసులు ఉండవని ప్రకటించింది. భారత్‌ నుంచి బయలుదేరిన వాటిని కూడా ఇతర మార్గాల్లో తిరిగి వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పింది. పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ప్రయాణికులకు కూడా అప్ డేట్స్ ఇస్తూ ఉంటామని చెప్పింది. ప్రయాణికులు భద్రత, క్షేమం కోసమే ఈ చర్యలను చేపట్టామని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే… ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు ( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు. ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *