మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కూలీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న కూలీ (Coolie) మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) నుంచి నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ (Shruti Haasan), రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో ఎప్పుడూ చేయని విధంగా డిఫరెంట్ గా ఉండబోతుంది.

తాజాగా.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను 3 నిముషాల కంటే ఎక్కువగానే కట్ చేశారు. ట్రైలర్ లో రజినీకాంత్ (Rajinikanth) లుక్ అదిరిపోయింది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్టు గానే ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన నేపథ్యంలో.. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ (Aamir Khan) కీలక పాత్రలు చేస్తున్నారు. శృతిహాసన్ కీ రోల్ ప్లే చేస్తోంది. కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు నాట భారీగా బిజినెస్ జరిగింది ఈ మూవీకి. రజినీకాంత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. లోకేష్ డైరెక్షన్ కాబటి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘జైలర్ ‘ తర్వాత రజినీ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ , ఇతర ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మోనికా , కు..కు..కూలీ పవర్ హౌస్ సాంగ్స్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.