Good news for AP women, another new scheme coming soon

ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ మహిళలకు కూటమి పార్టీలు ఆర్టీసీ (RTC) ఉచిత బస్సు ప్రయాణం (Free bus scheme) కల్గిస్తానని హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చి యాడాది పూర్తి చేసుకోని మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం (coalition government) సర్వం సిద్దం చేసుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే..

ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ (Super Six) హామీల అమల్లో భాగంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్న ప్రభుత్వం.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించి ఈ పథకం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు 15..

ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు.. ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి.. 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ.. వంటి వివరాలు ఆ టిక్కెట్లో పొందుపరచాలని చెప్పారు.

కొత్త పథకం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా… ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి.. ఎటువంటి విధానాలు తీసుకురావాలి… అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు.

“జీరో ఫేర్ టిక్కెట్”

జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది.. మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని… అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *