Gold prices have fallen sharply..!

Today gold prices : సామాన్యుడికి గుడ్ న్యూస్..! భారీగా తగ్గిన బంగారం ధరలు..! క్యూ కట్టిన పసిడి ప్రియులు..!

తగ్గిన బంగారం..!

బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్.. ఒక ధైర్యం. కానీ ప్రస్తుతం పసిడి ధరలు చూస్తుంటే సామాన్యుడి గుండె ఆగిపోయేలా ఉంది. మార్కెట్‌లో రేట్లు ఏ క్షణాన పెరుగుతాయో, ఏ నిమిషాన పడిపోతాయో అర్థం కాని వింత పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా సరే, నగల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కొందామంటే ధర భయం.. వద్దు అనుకుంటే పండగలు, శుభకార్యాల ఒత్తిడి. ఈ అయోమయ స్థితిలో అసలు బంగారం మార్కెట్ ఎటు వెళ్తోంది? ఇన్వెస్టర్లు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఈ సంచలన మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకుందాం.

ఇక విషయంలోకి వెళ్తే…

బంగారం ప్రియులకు ఊరట లభించింది. గురువారం కాస్త బంగారం ధరలు శాంతించాయి. గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ రేటు పెరుగుతూ వస్తుంది. ఇవాళ కాస్త బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరల్డ్ వ్యాప్తంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు పసిడి, వెండి ధరలను భారీగా పెంచేస్తున్నాయి. డాలర్ బలహీనపడటంతో ఇన్వెస్టర్లు బంగారం మీదకు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలు సామాన్యులకు కొన్ని సమయాల్లో చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికీ పీక్స్ స్టేజీకి వెళ్లిన బంగారం ధరలు ఇంకా తగ్గాలని పసిడి ప్రియులు విన్నవించుకుంటున్నారు. ఇక ఫిబ్రవరి 26న దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.21 తగ్గి రూ.16,168 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.20 తగ్గి రూ.14,820 ఉంది.100 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 2,100 తగ్గి రూ.1,16,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములు రూ.2,000 తగ్గి రూ. 1,82,000గా ఉంది.

హైదరాబాద్..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.210 తగ్గి రూ.1,61,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 తగ్గి రూ.1,48,200 మార్కెట్‌లో ధర పలుకుతోంది.

ఆంధ్రప్రదేశ్..

విజయవాడ నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.210 పతనమై రూ.1,61,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పతనపై రూ.1,48,200గా ఉంది.

తమిళనాడు..

తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,62,770 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,49,200 పలుకుతోంది.

మహరాష్ట్ర – ముంబై..

ముంబై నగరంలో నేడు బంగారం ధరలు ఈ విధంగా నమోదు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.1,61,680గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200 పలుకుతోంది.

ఢిల్లీ..

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,830 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,350గా ఉంది.

ఆల్ టైమ్ ధరల నుంచి..పడుతూ లేస్తున్న బంగారం, వెండి ధరలు

జనవరి 29వరకు ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేసిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత అనూహ్యంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా వెండి ధర రూ.4,25,000 రికార్డు ధర నుంచి భారీగా పతనమవుతు వచ్చింది. హెచ్చు తగ్గుల మధ్య ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద నిలిచింది. ఇకపోతే బంగారం రూ.1,78,250ల నుంచి దిగివచ్చినప్పటికి హెచ్చు తగ్గుల మధ్య ప్రస్తుతం తులం రూ.1,61,680వద్ద కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ అస్ధిరతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నిర్ణయాలు, ఇరాన్ పై దాడికి సన్నాహాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల మార్పులు, డాలర్ విలువ మార్పులతో బంగారం, వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు సైతం బంగారం వంటి విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి.మొత్తం మీద భవిష్యత్తులో దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు పుంజుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.

2 లక్షల మార్క్‌కు చేరువలో..

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ ఔన్సు బంగారం ధర 5600 డాలర్ల నుంచి 5602 డాలర్లకు చేరుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం గోల్డ్ పెరిగింది. మునుపటి సెషన్‌లో స్పాట్ ధరలు 4.6 శాతం పెరిగాయి. ఇవాళ మూడో సెషన్‌లోనూ బంగారం ధరలు లాభాలను కొనసాగించాయి. నేటి ర్యాలీలో కేవలం 2 లక్షల మైలురాయికి చేరువలో బంగారం ధరలు ఉన్నాయి. నేడో, రేపో 2 లక్షల మార్క్‌కి చేరుకునే అవకాశముంది. 2025లో ఏకంగా 64 శాతం బంగారం ధరలు పెరగ్గా.. ఈ సంవత్సరంలో ఇప్పటికే 27 శాతం పెరిగింది. ఇక వెండి ధర 67 శాతం పెరిగింది. ఇక బంగారం ధరలు తొలిసారి రూ.1.91 లక్షలకు పెరగ్గా.. జనవరిలో ఇప్పటివరకు 31 శాతం ధరలు పెరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *