Iran-Israel war, Gold prices : యుద్దం ముదురుస్తుంది..! బంగారం పడిపోతుంది..! ఇవాళ ధర తెలిస్తే షాక్..!
Gold prices : పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటి నమ్మడం లేదా.. అవునండి.. ఇప్పుడు పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి మరి. ఇన్నాళ్లు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. గడచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. కేవలం నాలుగురోజుల్లోనే బంగారం ధర రూ.10 వరకు తగ్గింది అంటే నమ్మండి. ఇక ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఇక విషయంలోకి వెళ్తే…
సాధారణంగా యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ వార్ వేళ ఈ సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధం ముదురుతున్న కొద్దీ గోల్డ్ రేట్లు తగ్గటం చూస్తున్న చాలా మంది కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వెండి రేట్లు కూడా తక్కువ అస్థిరతలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తమ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి. ఇన్నాళ్లు కొండెక్కి కూర్చున్న పసిడి ధరలు ఇప్పుడు వరుసగా దిగొస్తున్నాయి. గడచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. కేవలం నాలుగురోజుల్లోనే బంగారం ధర రూ.10 వరకు తగ్గింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా దాదాపు వెయ్యి వరకు బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారికి ఇది మంచి తరుణమనే చెప్పాలి.ఈ రోజు కూడా బంగారం ధరలు మరోసారి తగ్గడం విశేషం. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,63,680కి చేరుకోగా, ముంబైలో, ధర 10 గ్రాములకు రూ. 1,63,530 పలుకుతుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24K తులం గోల్డ్ రేట్ రూ.1,63,530 గా, 22K 10 గ్రాముల బంగారం రూ.1,49,900 లు పలుకుతుంది.
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రభావంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతూ రావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధరలు 0.8 శాతం పెరిగి ఔన్సుకు 5,176.69 డాలర్లకు చేరుకోగా ఏప్రిల్ డెలివరీకి సంబంధించి యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఒక శాతం పెరిగి ఔన్సుకు 5,186.30కి డాలర్లకు చేరుకుంది.
హైదరాబాద్లో బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 16,353, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 14,990 ఉండగా, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 12,265 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలోనూ కిలో వెండి ధర రూ.2.95 లక్షలు పలుకుతోంది. చెన్నైలోనూ వెండి ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి.