ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే అనే ఒక రూమర్ కోస్తా తీర ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. బలమైన గాలులు, భారీ అలల కారణంగా సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని, అందులో బంగారు ముక్కలు కూడా ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తీర ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు ఇప్పటికే తమకు కొన్ని చిన్న చిన్న బంగారు ముక్కలు లేదా గవ్వలు, రాళ్ల మధ్య కలిసిపోయిన బంగారు రేణువులు దొరికాయని చెప్పుకుంటున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే…
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకి రాష్ట్రాని అంతులేని విద్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బలమైన తుఫాన్గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇక తుఫాన్ తగ్గిన తర్వాత.. ఉప్పాడ తీరంలో పెద్ద ఎత్తున్న ప్రజలు గుమిగుడారు. వరుస పెట్టి సముద్ర తీరానికి ప్రజలు తరలివచ్చారు. ఏంటా అని ఆరా తీస్తే.. తుఫాన్ వస్తు వస్తు ఏమైనా సముద్ర బంగారన్ని తీసుకోచ్చిందా అని ఒక్క చిన్న ఆశ. ఆ ఆశే వాళ్లను తీరంలో సర్చ్ ఆపరేషన్ చేయించింది. తుఫాన్ ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారం ముక్కలు కొట్టుకొచ్చాయా..? అని ఎగబడి మరి వెతుకున్నారు. ఇక ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు దొరుకుతాయని ఏరుకునేందుకు పోటీపడుతున్నారు స్థానికులు. ఇక ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో.. ఉప్పాడ తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన వందలాది మంది ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వెంబడి గాలిస్తున్నారు. సముద్రపు ఇసుకను జల్లెడ పట్టడానికి, రాళ్ల సందుల్లో వెతకడానికి ప్రజలు తాపత్రయ పడుతున్నారు. ఈ నమ్మకానికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారం ఏమీ లేనప్పటికీ.. తుఫానుల సమయంలో సముద్రపు అడుగు భాగం కదిలి.. అరుదైన వస్తువులు ఒడ్డుకు వస్తాయనే భావన స్థానికులలో బలంగా ఉంది. గతంలో వచ్చిన కొన్ని తుఫానుల తర్వాత కూడా ఈ విధంగా ప్రజలు తీరానికి చేరుకుని గాలించిన దాఖలాలు ఉన్నాయి.

వాస్తవం ఇదే..
కాగా, గతంలో రాజులు కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న విలువైన వస్తువులు ఇలాంటి తుఫాన్ల సమయంలో బయటపడతాయని గతంలోనూ తుఫాన్ వచ్చిన సమయంలో.. ఉప్పాడ తీరంలో స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు.. స్థానిక మత్స్యకారులు తుఫాన్ తర్వాత తీరంలో బంగారం కోసం జల్లెడపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. గతంలో, చిన్నారులు సైతం స్కూల్ మానేసి బంగారం కోసం వెతికారు.. అక్కడ కొందరికి బంగారు రేణువులు దొరికాయని.. మరికొందరికి ఉంగరాలు, ముక్కుపుడలకు దొరికాయి. అంతేకాదు, గతంలో ఈ ప్రాంతంలోనే వెండి నాణేలు కూడా పెద్ద సంఖ్యలు దొరికాయి.. దీంతో, మరోసారి సముద్ర తీరానికి వచ్చి.. ఏమైనా దొరుకుందా? అనే కోణంలో సముద్ర తీరాన్ని జల్లడ పడుతున్నారు స్థానికులు.. అసలే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైరికార్డులను సృష్టించి.. కాస్త తగ్గుముఖం పట్టాయి.. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి కూడా ఏర్పడడంతో.. ఇప్పుడు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు.. వాళ్లకు దొరికి చిన్ని బంగారం రేణువులతో సంతోషపడుతున్నారు.