- కరువు సీమలో కనక వర్షం.. ఏపీలో మొదలైన బంగారం వెలికితీత..!
- కోటి టన్నుల బంగారం తీయడమే లక్ష్యం..!
APకి స్వర్ణయుగం..
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’ అనే సంస్థ చేపట్టింది.

ఇక విషయంలోకి వెళ్తే..
భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులు కొనుగోలు చేయలేనంత భారీగా పెరిగింది. ఇక మన దేశంలో బంగారంకి ఇచ్చే వ్యాల్యూ ప్రపంచ దేశ ప్రజలు ఎవ్వరు ఇవ్వరు. ప్రతి మధ్య తరగతి ఫ్యామిలీలో గీ బంగారం ఉంటుంది. లేకుంన్న అప్పు చేసి మరి బంగారం ను కొనుగోలు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒకానోక సమయంలో ఇంట్లో తినడానికి బియ్యం గింజ లేకున్న.. బీరువాలో మాత్రం బంగారం ఖచ్చితంగా ఉంటుంది. అది మన సామాన్యలు ఇంట్లో ఉండే బంగారం విలువ. కానీ ప్రస్తుతం సామాన్యులకు ఆ బంగారమే అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం మన దేశంలో బంగారం కొనేందుకు సామ్యానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరికిరాని కొయ్యగా బంగారం మారింది మరి. అలా సామాన్యులకు గుది బండగా మారిన బంగారం.. త్వరలోనే అతి తక్కువ ధరకే బంగారం కొనబోతున్నాం. ఏంటీ నమ్మడం లేదా.. నిజంగా మరి కొన్ని రోజుల్లో బంగారం చౌకకే రాబోతుంది. అంటే అర్ధం కాలేదుగా.. అంటే మనదేశంలోనే దేశీయంగా బంగారం వెలికితీత పనులు ప్రారంభం అయ్యాయి.

1500 ఎకరాల్లో బంగారం గనులు..
గతంలో కర్నూలు జిల్లాలో 1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన విషయం
తెలిసిందే. అయితే ఈ నిల్వలను వెలికితీసేందుకు పరిశోధన సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాకల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే గుర్తించింది. ఈ మేరకు బంగారం వెలికితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చాయి. ఇప్పటికే విదేశీ సంస్థలు పరిశోధనలు కూడా చేశాయి. జియో మైసూర్ అనే సంస్థ పరిశోధనలు చేసింది. ఇందుకోసం తుగ్గలి మండలంలో దాదాపు 599 హెక్టార్ల భూములను లీజుకు తీసుకుని డ్రిల్లీంగ్ కొనసాగించాయి. కోర్ ట్రెల్లింగ్ ద్వారా రాళ్లను వెలికి తీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్కు తరలించారు. భూగర్భంలో 180 మీటర్ల లోతులో నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. డ్రిల్లింగ్ చేసి శ్యాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఈ మేరకు ఎకరాకు రూ.16, 500 చొప్పున రైతులకు కౌలు చెల్లించారు. ఈ ప్రాంతంలో పరిశోధనలు జరిపేందుకు 2043 వరకు అనుమతులు ఉన్నాయి. ఇక బంగారం నిల్వలను బయటకు తీసేందుకు పనులు మొదలైయ్యాయి. అంటే త్వరలోనే రాళ్లసీమ స్వర్ణ సీమ కాబోతోంది.

6000 టన్నులే లక్ష్యం..!
కరువు సీమలో నుంచి కనకం బయటకు వచ్చేస్తుంది. జొన్నగిరిలో బంగారు నిక్షేపాలు మన దేశంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కర్నూలు జిల్లాలో బంగారం తవ్వకాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడంతో పాటు ఇక్కడ ఉన్న బంగారు నిల్వలను నిర్ధారించారు. పగిడిరాయి జొన్నగిరి మధ్య పరిశోధనలు జరిపిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడించింది. అంటే.. ఈ తవ్వకాలకు.. జొన్నగిరి పగిడిరాయి మధ్య 1477 ఎకరాలలో తవ్వకాలకు జియో మైసూర్ కంపెనీ అనుమతులు పొందింది. ఇక్కడ ఒక టన్ను మట్టి నుండి 1.5 నుండి రెండు గ్రాముల వరకు పసిడి ఉత్పత్తి అవుతుంది. టన్ను మట్టి నుండి 1.5 నుండి రెండు గ్రాముల వరకు బంగారం వెలికి తీయాలంటే సుమారు 5000 రూపాయలు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. 6000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యం వెయ్యి టన్నుల మట్టి శుద్ధి చేస్తే దాదాపు 700 గ్రాముల బంగారం లభిస్తుందని సంస్థ యాజమాన్యం చెప్తుంది. మొత్తం రాబోయే 10 సంవత్సరాలలో ఈ మైనింగ్ సంస్థ ఏపీలోని జొన్నగిరి ప్రాంతం నుండి 6000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు.. జియో మైసూర్ సంస్థ ఏడాదికి నాలుగు లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీసి 3లక్షల టన్నులను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అధునాతన యంత్రాలతో ఈ పనిని మరింత వేగవంతం చేస్తూ బంగారం తవ్వకాన్ని చేపట్టారు.

తక్కువ బంగారం..
ఇక పూర్తిగా బంగారు ఖనిజం మన వద్ద ఉండటంతో.. భవిషత్యులో బంగారం ధరల్లో మార్పులు వచ్చే అతి తక్కువ ధరకే బంగారం కొనులు చేసుకోవచ్చు అని ఆ అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. దీంతో మనదేశంలో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవలసిన అవసరం ఇకపై ఉండదు.