Gold and silver prices down slightly

Gold, silver prices : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?

గత రెండ్రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం మళ్లీ ఆల్‌లైం హైకి చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

ఇక విషయంలోకి వెళ్తే..

పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూ అనే చెప్పాలి మరి. ఈ మధ్య పుత్తడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి.. ఇక సామాన్యులకు అయితే పసిడి అందని ద్రాక్షగా మారింది. ఎందుకంటే వాటి ధరలు అట్లున్నాయి మరి. ఆ బంగారం ధరలు చూస్తే గుండె దడ పుడుతోంది. ఇలా వెళ్తున్న రోజు నుంచి గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతు వచ్చాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గి.. ఇంకో రోజు భారీగా పెరిగిపోవడంతో గోల్డ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు.

నేటి బంగారం ధరలు..

ఈరోజు మాత్రం తులం గోల్డ్పె రూ.660 తగ్గగా.. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. బులియన్ మార్కెట్ లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.660 తగ్గి.. రూ.1,34,180 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 600 తగ్గి రూ.1,23,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 తగ్గి రూ.1,00,640 దగ్గర ట్రేడ్ అవుతోంది.

సిల్వర్ ధరలపై ఉపశమనం..

ఇక సిల్వర్ ధర ఈరోజు ఉపశమనం కలిగించింది. ఈరోజు కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,09,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నె బులియన్ మార్కెట్లో రూ.2,21,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,09,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.