Gokarna Atmalingam Full Story

దక్షిణ కాశీగా ప్రసిద్ధి… ఏడు ముక్తిస్థలాల్లో ఒకటి… ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం… ఆత్మలింగంగా కొలువుదీరిన పరమేశ్వరుడు… సాక్షాత్తు ఆ లంకేశ్వరుడి చే నిలుపపడ్డ దివ్య లింగం.. గణపతి నటనతో.. భరత ఖండం లోనే ఉండిపోయిన ఆత్మలింగం.. ఆ దశకంఠుడినే బోల్తా కొట్టించిన పుణ్యస్థలం.. వీటన్నింటి మేళవింపే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు.. ఆ నీలకంఠుడే కొలువైన ఆత్మస్థలం.. ఈ భూకైలాసం..
అదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం.

గోకర్ణ అంటే అర్ధం తెలుసా..?

ఆరేబియా మహా సముద్రం ఒడ్డునున్న పరమ పావనమైన క్షేత్రం. గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. గంగావళి, అఘనాశిని నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని చెబుతారు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం కర్ణాటక, ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది. ఏడు ముక్తిస్థలాలలో ఒకటిగా పిలిచే గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే, దీన్ని మయూరశర్మ అనే రాజు నిర్మించాడు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో స్వామికి మహాబలేశ్వరుడని పేరు.

స్థలపురాణం ఏం చెబుతుంది..?

కాస్త పురాణంలోకి వెళ్తే.. రావణాసురుడిలానే అతడి తల్లి కైకసి కూడా అపర శివభక్తురాలట. తన కుమారుడి శ్రేయస్సు కోరి రోజూ పరమేశ్వరుడిని పూజించేది. ఆ భక్తిని చూసి ఇంద్రుడు అసూయపడి ఓ రోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడేశాడట. శివలింగం లేక తన పూజకు ఆటంకం కలగడంతో రావణాసురుడి తల్లి నిరాహార దీక్షను చేసింది. అది చూసిన రావణుడు తన తల్లికోసం శివ లింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్లాడట. శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని కిందపెడితే గనుక అక్కడే ఉండిపోతాననే షరతు పెట్టాడట. దాంతో రావణుడు ఆ లింగాన్ని చేతపట్టుకుని లంకకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి సంధ్యాసమయం కావడంతో రావణుడు రోజువారీ పూజకు సిద్ధమయ్యా డట. అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తుంటే… వినాయకుడు బాలుడి వేషంలో కనిపించాడు. రావణుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడట. వినా యకుడు దానికి ఒప్పుకుంటూనే అది బరు వుగా ఉందనీ… తాను ఎక్కువసేపు ఆ లింగాన్ని పట్టుకోలేనని చెప్పాడట. రావ ణుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్లాడట. పూజ కాస్త ఆలస్యం కావ డంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపైన పెట్టాడట. ఆ తరువాత రావణుడు వచ్చి చూసి లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు బయలుదేరాడట. అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే ఇది.

గణపతి తలపైన సొట్ట ఎందుకు పడింది…?

ఓ వైపు ఆధ్యాత్మికతా, మరోవైపు ప్రకృతి రమణీయతా కనిపించే ఈ గోకర్ణంలో స్వామిని దర్శించుకున్నంత మాత్రానే కరుణిస్తాడనీ, వరాలను కురిపిస్తాడనీ అంటారు. గోకర్ణానికి వచ్చే భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి… ఆ తరువాత ఆలయానికి చేరుకుంటారు. ప్రాంగణానికి వచ్చే భక్తులు ముందుగా గణప తిని దర్శించుకుని ఆ తరువాత ఆత్మలింగం చెంతకు వెళ్తారు. ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడనే కోపంతో రావణాసురుడు గణపతి తలపైన మొట్టికాయ వేశాడట. దానికి గుర్తుగా మహాగణపతి విగ్రహం తలపైన ఇప్పటికీ సొట్ట కనిపిస్తుంది. పరమేశ్వరుడితోపాటు కొలువైన అమ్మవారు ఇక్కడ తామ్రగౌరిగా పూజలు అందుకోవడం విశేషం. భక్తులు స్వయంగా స్పృశించే శివలింగానికి ఏడాది మొత్తం విశేష పూజలు చేస్తారు. శివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూసేందుకు భక్తులు ఎక్కడె క్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. నలభైఏళ్లకోసారి అష్ట బంధన పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులకు చూపిస్తారు. పితృకార్యాలు నిర్వహించే ఈ ఆలయంలో ఇతర దేవతల్నీ దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి..? ఎలాంటి సర్వీసులు ఉన్నాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఈ ఆలయానికి విమానంలో చేరుకోవాలను కునేవారు ముందుగా గోవా లేదా మంగళూరు విమానాశ్రయాల్లో దిగాలి. అక్కడి నుంచి గోకర్ణానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైల్లో రావాలను కునే భక్తులు అంకోలా రైల్వేస్టేషన్లో దిగితే ఆలయం దాదాపు ఇరవైఅయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సుల్లో రావాలనుకునే వారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *