మనలో చాలా మంది విమానంలో ప్రయాణించాలని అనుకుంటారు. కొందరికి అయితే అది ఒక డ్రీమ్. అతి తక్కువ టైంలో కాస్త ఖర్చుతో మీ గమ్యాలను చేర్చే గగన మార్గం.
ఇక విషయంలోకి వెళ్తే మీరు చాలా సార్లు విమానం ప్రయాణం చేసి ఉంటారు. ఎయిర్ పోర్టులో మీకు కొన్ని లాంజ్లు కనిపిస్తు ఉంటాయి. అక్కడ ఫ్రీ.. ఫ్రీ.. అని రాసి ఉంటుంది. కానీ చాలా మంది ఆ ఫ్రీ.. ఫ్రీ.. వెనుక వెనుక ఉన్న లాజిక్ తెలియకా.. ఆ అద్బుత అవకాశాన్ని వినియోగించుకోరు. మరి ఆ ఫ్రీ.. ఫ్రీ.. వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
విమాన ప్రయాణాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే ప్రయాణ చార్జీలు ఎక్కువగా ఉండటంతో ఇష్టపడే ప్రతి వారు దానిని ఎక్కి ప్రయాణించలేరు. విమాన ప్రయాణాలు చేసే సమయాల్లో ఒక్కోసారి ఫ్లైట్ లేట్ అవ్వొచ్చు. లేదా సాంకేతిక కారణాలతో రద్దవ్వచ్చు. ఆ సమయంలో చాలా గంటల పాటు వేచి ఉండాల్సి రావొచ్చు. అప్పుడు విమానాశ్రమం లాంజ్ లో మనం ఉండాల్సి ఉంటుంది. అయితే లాంజ్ యాక్సెస్ చేయాలంటే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే డొమెస్టిక్ లాంజ్ల ఖర్చు రూ.600-1200, అంతర్జాతీయ లాంజ్ల ఖర్చు $25-35 వరకు ఉంటుంది. మీరు 30 నిమిషాలు లాంజ్ లో కూర్చుని టీ, కాఫీ తాగి శాండ్ విచ్ తిన్నందుకు ఆ బిల్లును బ్యాంక్ చెల్లిస్తుంది. ఈ వ్యయాన్ని బ్యాంకులు లేదా కార్డు నెట్వర్క్లు భరిస్తాయి. అదే ఉచితంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అంటారా..? కానీ కొన్ని క్రెడిట్ కార్డులు విమానాశ్రయంలో లాంజ్ యాక్సెస్ ను అందిస్తాయి. నిజానికి భారత్ లో ఉన్న చాలా ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ సందుపాయం ఉంది. వీటిల్లో కేవలం మన కార్డు స్వైప్ చేస్తే సరిపోతుంది. అలా చేస్తే ఎంచక్కా బఫే ఫుడ్, బేవ రేజెస్, వైఫై, ఛార్జింగ్ పాయింట్స్, న్యూస్ పేపర్స్, రిక్లెయినర్లు, కొన్నిచోట్ల స్లీపింగ్ పాడ్స్, స్పా వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చని తల్రేజా పేర్కొన్నారు. వాస్తవానికి ఇవన్నీ చాలామందికి “ఫ్రీగా” లభిస్తాయనే భావన ఉంది. కానీ నిజానికి అవి ఉచితం కావు. మనం తెలుసుకోని విధంగా వాటికి ఖర్చు అవుతుంది. అది మేము నేరుగా చెల్లించకపోయినా!
తాజాగా తల్రేజా చేసిన ఈ ఒక్క పోస్టు.. సుమారుగా 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.