బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు.
బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే.. అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రధాన అనుచరులు గా ఉన్న పదర మాజీ జడ్పీటీసీ రాంబాబు నాయక్, సీనియర్ నేత ఎర్ర నరసింహ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ సమన్వయంతో రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ సోమవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్లి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బాలాజీ సింగ్ ఠాగూర్ తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీలో చేరిన నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధి కోసం పార్టీలోకి రావడం శుభ పరిణామం అని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి అన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గువ్వల బాలరాజు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను మరింత గందరగోళానికి గురి చేస్తోంది. దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న బీజేపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక గువ్వల బాలరాజు 2014, 2019లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లోకాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి చెందారు. తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.