భారత కమ్యూనిస్టు పార్టీ ( Bharat Communist Party) మార్క్సిస్టు (Marxist) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి (former Chief Minister) వీఎస్ అచ్యుతానందన్ (VS Achuthanandan) కన్నుమూశారు. కమ్యూనిస్ట్ కురువృద్ధిగా పేరొందిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. సీపీఐ (ఎం) వెటరన్ నాయకుడైన అచ్చుతానందన్ గుండె సంబంధిత సమస్యలతో101 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్త తెలిసి కమ్యూనిస్టు నేతలంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పార్టీలకు అతీగంగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు.
Also Read : Bangladesh plane Crash : బంగ్లాదేశ్ లోని ఢాకాలో కుప్పకూలిన యుద్ద విమానం.. ఒకరు మృతి
రాజకీయ ప్రస్థానం..
అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పుజాలోని పున్నప్రాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనపై కమ్యూనిస్ట్ భావాజాలం ప్రభావం పడింది. స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు వీకే కరుణాకరన్ ప్రసంగాలు ఆయనను ప్రజాపోరాటల వైపు, కార్మికుల హక్కుల కోసం నినదించేలా చేశాయి. కేరళ రాజీకీయాల్లో (Kerala Politics) అచ్యుతానందన్ ప్రస్ధానం మరువలేనిది. పద్దెనిమిదేళ్లు నిండక ముందు నుంచే క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు అచ్యుతానందన్. అచ్యుతానందన్ 1939లో స్టేట్ కాంగ్రెస్లో (Congress) చేరారు. 1940లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. 1964లో సీఎఐ నుంచి బయటికొచ్చిన 32 మందిల్లో అచ్యుతానందన్ ఒకరు. అనంతరం.. మూడేళ్లకు అంబలప్పుజా నుంచి 44 ఏళ్ల వయసులో తొలిసారి శాసన సభ్యునిగా గెలుపొందారు. ఆయన ఉద్యమ సహచరిణి కే వసుమతిని వివాహం చేసుకున్నారు.
Also Read : Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!
82 ఏళ్ల వయసులో సీఎంగా ప్రమాణ స్వీకారం..
ఆ తర్వాత ప్రజాకర్షణ నేతగా ఎదిగిన ఆయన 2006లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 15 సంవత్సరాలు వరుసగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2011 అనంతరం మూడు పర్యాయాలు విపక్ష నేతగానూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారీ సీపీఎం నేత. ఆయనకు 2019లో చిన్నగా స్ట్రోక్ (stroke) వచ్చింది. అయినా సరే ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడారు. ఆయన చివరిసారిగా 2016 నుండి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వ పదవిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం అక్టోబర్లో ఆయన 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
Suresh