Food delivery app Swiggy increases platform charges

స్విగ్గీ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో.. ఎక్కువగా కనిపించే ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్. మీకు ఆకలిగా ఉందా.. అయితే స్విగ్గీ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి. ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా వెళ్తే ఇంట్లో ఫుడ్ వండేందుకు ఒపిక లేదా..? ఈ స్విగ్గీ ఓపెన్ చెయ్.. ఫుడ్ ఆర్డర్ పెట్టు. క్షణాల్లో మీ చేతిలో ఆహారం ఉంటుంది. మీరు ఇప్పుడేందు ఈ స్విగ్గీ టాపిక్ వచ్చింది అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ మరో సారి ఛార్జీలను పెంచేసింది.

ఇక విషయంలోకి వెళ్తే..

మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ అయిన స్విగ్గీ మరో సారి ఛార్జీలను పెంచేసింది. గతంలో కూడా పలు మార్లు స్విగ్గీ ఫాట్ ఫామ్ ఫీజును పెంచింది. ఇలా వరుసగా స్విగ్గీ ఫీజులు పెంచుకుంటు పోవడంతో ఫుడీ లవర్స్ కి బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది. వాస్తవానికి.. ఆర్డర్ల సంఖ్య పెరిగితే ఎవరైనా ఫీజులు లేదా వస్తువులపై రేట్లు తగ్గిస్తారు. కానీ స్విగ్గీ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాట్ ఫామ్ ఫీజులను పెంచేసింది. ఈ పెంపుకు కారణాలు సైతం స్విగ్గీ ప్రకటించింది. పండుగ సీజన్ లో ఆర్డర్లు పెరిగాయని అందుకే తమ ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతున్నామని స్విగ్గీ అనౌన్స్ చేసింది. ఇక మీదట ప్రతీ ఫుడ్ డెలివరీ ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14కి పెంచింది. ఇంతకు ముందు ఈ ఫీజు రూ.12 ఉండగా..ఇప్పుడు అది రెండు రూపాయలు పెరిగింది.

రోజు 20 లక్షల ఆర్డర్లు..

ప్రస్తుతం స్విగ్గీ రోజుకు 20 లక్షలకుపైగా ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం, ప్లాట్‌ఫాం ఫీజు ద్వారా రోజుకు సుమారు రూ.2.8 కోట్లు, త్రైమాసికానికి రూ.8.4 కోట్లు, సంవత్సరానికి రూ.33.6 కోట్లు అదనంగా సంపాదించే అవకాశం ఉంది. పండుగ సీజన్‌ తర్వాత ఈ ఫీజును మళ్లీ రూ.12కి తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో జొమాటో, స్విగ్గీ రెండూ డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఫీజు పెంచి, ఆర్డర్ల సంఖ్యలో తగ్గుదల లేకపోతే ఆ రేటును కొనసాగించాయి.

రెండేళ్లలో 12 రూపాయలకు పెంచిన స్విగ్గీ..

స్విగ్గీ మొదటిసారిగా 2023 ఏప్రిల్‌లో ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఇది కేవలం రూ. 2 మాత్రమే ఉండేది. స్విగ్గీ క్రమేపీ దాన్ని పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే కేవలం రెండేళ్ళల్లో అది కాస్తా రూ. 14గా మారింది. 2024 చివరి నుండి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో ప్లాట్‌ఫారమ్ లేదా హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత, ఆర్డర్ల సంఖ్యపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకపోవడంతో, ఈ ఫీజును క్రమంగా పెంచింది.

లాభమా..? నష్టమా..?

స్విగ్గీ పని తీరు ఇలా ఉంటే.. జోమాటో మాత్రం తన ప్లాట్ ఫామ్ ఫీజును రూ. 10 దగ్గరే స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9 నుంచి 15 వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1 నుండి 3 శాతం వరకూ ఉంటుంది. ఈ ఫీజులు వినియోగదారుడు ప్రాంతాన్ని బట్టి కూడా ఇవి మారుతున్నాయి. దీని ద్వారా ప్రతి ఆర్డర్‌పై లాభాన్ని పెంచి, కంపెనీ ఆదాయాన్ని బలోపేతం చేయడమే స్విగ్గీ సంస్థ ఎకైక లక్ష్యం. ప్రస్తుతం స్విగ్గీ పెంచిన ప్లాట్ ఫామ్ ధర వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా స్విగ్గీ కి మాత్ర భారీగానే లాభం చేకూరనుంది. స్విగ్గీ ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా, పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు స్విగ్గీ సంస్థకు మైనస్ గా కూడా మారొచ్చని అంటున్నారు. ఎందుకంటే జొమాటో ఫీజులు దీని కన్నా తక్కువ ఉండటంతో వినియోగదారుడు ఆ సంస్థ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *