గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సాంగ్స్ ఎప్పుడెప్పుడు బయటకొస్తాయా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగిపోతున్న ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. చెర్రీ మాస్ అప్పియరెన్స్ చూడొచ్చు. ఈ పాటలో లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే రామ్ చరణ్ హుక్ స్టెప్ డ్యాన్స్ అయితే మరి చెప్పక్కర్లేదు. జాన్వీ మాస్టర్ తనదైన శీలి డ్యాన్స్ స్టెప్స్‌తో సెన్సెషన్ క్రియేట్ చేయనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా చికిరి అని పిలుస్తారని దర్శకుడు వివరిస్తూ అంతకుముందే ఈ సాంగ్ ప్రోమో వీడియో వదిలారు మేకర్స్. ఈ వీడియోతో ఆసక్తి రేకెత్తించి తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. ఈ రోల్ సినిమాకు ప్రధాన బలం కానుందని టాక్. తాజాగా రిలీజ్ అయిన ఈ చికిరి చికిరి సాంగ్‌లో జాన్వీ కపూర్ రామ్ చరణ్ ప్రేయసిగా కనిపించింది. తన అందం, డ్యాన్స్ స్టెప్‌లతో జాన్వీ అద్భుతంగా కనిపించింది. అయితే ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సంద్భంగా థియేటర్లలోకి రానుంది.