అమెరికాలో మరో సారి విమన ప్రమాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ప్రపంచ చాలా చోట్లు వరుస విమన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు విమానంలో ప్రయాణించాలంటే వెణులో వనుకు పుడుతుంది. దీంతో గగన ప్రయాణం కంట్లే రోడ్డు ప్రయాణంపైవే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాగా తాజాగా జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్నది అయితే కాదు.. అది ఒక వైద్య విమానం.
ఇక వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని (America) మరో విమాన ప్రమాదం (plane crash) జరిగింది. ఉత్తర ఆరిజోనాలోని (Northern Arizona) నవజో నేషన్ లో (Navajo Nation) నిన్న జరిగిన ఒక విషాదకర విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అయితే చిన్ సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి రోగిని తీసుకెళ్లేందుకు ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. ఈ క్రమంలో ఫ్లైట్లో ఉన్నటుండి సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైలెట్ పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. దీంతో ఫ్లైట్ కూలినట్టుగా చిన్లే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో, బోర్డులో ఉన్న నలుగురు సిబ్బంది ఒక పైలట్, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి అధికారులు మాట్లాడుతూ, బీచ్‌క్రాఫ్ట్ 300 (Beechcraft 300) అనే చిన్న డ్యూయల్-ప్రొపెల్లర్ వైద్య రవాణా విమానం మధ్యాహ్నం సమయంలో చిన్లే విమానాశ్రయం సమీపంలో నేలపై కూలింది. దీంతో మంటలు చెలరేగాయని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు.
అయితే విమానం కూలిన తర్వాత విమానంలో చెలరేగిన తీవ్రమైన మంటలు రెస్క్యూ చేయలేని విధంగా దగ్ధమయ్యాయి. దీంతో బాధితులను రక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.నవజో నేషన్ అధ్యక్షుడు బువు న్యూగ్రెన్ ఈ ఘటనను “విషాదకర నష్టం”గా తెలిపారు.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడుతుందని చెప్పారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.