సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు. దీంతో మల్లేపల్లి బజార్ ఘాట్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 42మంది సజీవదహనం

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏకంగా 42 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీరంతా మక్కా నుంచి మదీనా కు వెళ్తున్న భారతీయు యాత్రికులు కావడం గమనార్హం. ఈరోజు తెల్లవారు జామున యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ ఘాడ నిద్రలో ఉండటంతో తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.
మృతుల్లే హైదరాబాదిలే ఎక్కువ..!
మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీ. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
సౌదీ బాధితుల సహాయార్ధం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసిన కేంద్రం
- కేంద్ర హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 8002440003
- హెల్ప్‌లైన్ నెంబర్లు 0122614093, 0126614276
సౌదీ ప్రమాదంపై దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
- వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044
- సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143
- రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157
సౌదీ బాధితుల సహాయార్థం కేంద్రం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు..
- కేంద్ర హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 8002440003
- హెల్ప్‌లైన్ నెంబర్లు 0122614093, 0126614276
- సౌదీ బాధితుల హెల్ప్‌లైన్ వాట్సప్ నంబర్- 0556122301