Everything is ready for the Amarnath Yatra in Kashmir. The first batch of 5,80 people has left.

అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra)కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు (సేఏపీఎఫ్‌) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. అంటే సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది అమ‌ర్‌నాథ్ రూట్లో విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు.

యాత్ర సర్వం సిద్దం..

జమ్మూకాశ్మీర్ లో హిమాలయపు శ్రేణనుల్లో ఉన్న అమర్‌నాథ్‌ యాత్ర కు (Amarnath Yatra) సర్వం సిద్ధం అయ్యింది. జమ్ము-కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్‌ ఇవాళ ఉదయం బయల్దేరి వెళ్లింది. ఈ యాత్రను జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా (Manoj Sinha) జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఇటీవలే పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడితో నేపథ్యంతో ఈ సారి యాత్రకు ముందు జాగ్రత్తగా..యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రత (tight security) ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.

‘నో ఫ్లై జోన్‌లు’ గా అమ‌ర్‌నాథ్

ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించింది. జులై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్‌నాథ్‌ యాత్ర మార్గాలను ‘నో ఫ్లై జోన్‌లు’గా జమ్ము ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు (Shri Amarnathji Shrine Board) ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్‌ సర్వీసులను (Helicopter Service ) రద్దు చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్‌ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని తెలిపింది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *