MareduMilli : అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Seetharama Raju Dist ) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కీలకమైన ముగ్గురు మావోయిస్టు నేతలు మరణించారు.

ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో… మావోయిస్టులకు మరో ఎదురదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju Dist ) జిల్లా మారేడుమిల్లి (Maredumilli) అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
Also Read :

మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణతో పాటు కేంద్రకమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు ఉన్నట్లు తెలిసింది. జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ (Aruna) ఉన్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు- కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి (Chalapati) భార్య రావి వెంకట హరిచైతన్య (Ravi Venkata Hari Chaitanya) అలియాస్ అరుణ ఉన్నట్టు సమాచారం. మరొకరి ఛత్తీస్గఢ్ (Chhattisgarh) కు చెందిన అంజు ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్ ది వరంగల్ (Warangal) జిల్లాలోని వెలిశాల గ్రామం కాగా.. అరుణది అనకాపల్లి జిల్లా (Anakapalle District) పెందుర్తి గ్రామం. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Suresh