ఉరి శిక్ష రద్దు..!
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా.. కేఏ పాల్ ట్వీట్టర్ లో ఓ సంచలనమైన పోస్ట్ పోస్ట్ చేశారు. తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఎలా ఆగింది..? చివరి నిమిషంలో కేఏ పాల్ చేసిందేమిటి..? కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా..? ఇంతకూ ఇప్పుడు కేఏ పాల్ ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?అయితే, ఈ వ్యవహారంలో తాము చేయాల్సింది అంతా చేశామని, ఇక తాము ఏమీ చేయలేము అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. అప్పుడే ఎంటర్ అయ్యారు ప్రపంచ శాంతి దూతగా పేరున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్.
త్వరలో నిమిష ప్రియ విడుదల..?
తాజాగా… యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హత్య కేసులో యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష రద్దు చేశారు. ఈ విషయాన్ని క్రైస్తవ మత ప్రచారకుడు, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ట్విట్టర్ వేధికగా ప్రకటించారు. మంగవారం యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్ తో కేఏ పాల్ చర్చలు..
ఇక ప్రస్తుతం కే. ఏ పాల్ యెమెన్ దేశంలో యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిజానికి భారత ప్రభుత్వం వల్ల జరిగిందా లేదా కే.ఎ పాల్ వల్ల జరిగిందా అంతటే ఎక్కువ శాతం కేఎ పాల్ వైప్ అశలు ఉన్నాయి. అందుకు కారణం.. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం యెమెన్ దేశంలో ఎటువంటి దౌత్య సంబంధాలు గానీ, రక్షణ ఒప్పందాలు కానీ, వాణిజ్య ఒప్పందాలు కానీ చేసుకోలేదు.
దీంతో భారతదేశం యెమెన్ దేశంతో సంప్రదించే అవకాశం చాలా తక్కువగా ఉంది. దీంతో నేరుగా కేఏ పాల్ రంగంలోకి దిగి.. నేరుగా యెమెన్ ప్రభుత్వంతో పాల్ చర్చలు జరిపారు. పాల్ సహకారంతో భారత ప్రభుత్వం సైతం యెమెన్ దేశంలో చర్చలకు ముందుకొచ్చి నిమిషా ఉరి శిక్ష కేసు పునరాలోచన చేసి చర్చలు జరిగి ఫలించాయి.
Suresh