భారత దేశంలో.. పెళ్లిళ్లకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంది. గతంలో పెళ్లి చేసుకోవాలంటే.. మన పెద్ద వాళ్లు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మనుషులు మారారు. పెళ్లి అంటే.. ప్రస్తుతం ప్యాకేజీలా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెళ్లి అంటే వరుడిపై వధువు కాసుల వర్షం కురిపించాల్సిందే. తాజాగా.. పెళ్లి విషయంలో NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు బట్టబయలు అయ్యాయి. దేశంలో వరకట్నం వేధింపు కేసులు అంతకంతకు పెరిగిపోతున్నట్లు తేలిపోయింది.
ఇక విషయంలోకి వెళ్తే.. దేశంలో చాప కింద నీరులాగా వరకట్నం వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా.. మళ్లీ వరకట్నం వేధింపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి. ఈ వేధింపుల కారణంగా 6,156 మంది మహిళలు మృతి చెందారు. అయితే 2021లో చూసుకుంటే వరకట్న నిషేధ చట్టం కింద 13,568 కేసులు నమోదు కాగా.. 2022లో ఈ సంఖ్య 13,479కి తగ్గింది. కానీ 2023లో మాత్రం మళ్లీ కేసులు పెరిగాయి. కాగా ఇది దేశ వ్యాప్తంగా జరిగిన వరకట్న వేధింపులు వివరాలు మాత్రమే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికేసులు నమోదు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఇక దేశంలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక శాతం ఉత్తరప్రదేశ్ లో 7,151 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్‌లో 3,665 కేసులు, కర్ణాటకలో 2322 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల పరంగా చూస్తే అందూలోనూ ఉత్తర్ ప్రదేశ్ దే పై చేయ్. యూపీలోనే అత్యధికంగా 2,122 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత బిహార్‌లో1,143 మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు 2023లో 833 హత్యలు వరకట్న వేధింపుల వల్లే జరిగినట్లు రిపోర్టు పేర్కొంది. దాదాపు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (పశ్చిమ బెంగాల్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, సిక్కిం) 2023లో వరకట్న సంబంధిత మరణాలు కూడా చాలా తీవ్రమైన కేసులున్నాయి. 2023లో మొత్తం 6,156 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని NCRB నివేదిక పేర్కొంది. 2023లో 833 హత్యలకు వరకట్న వేధింపులు కారణంగా నివేదిక తెలిపింది. 2023లో మొత్తం 83,327 వరకట్న సంబంధిత కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 69,434 ఇంతకు ముందు నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాలంలో, 27,154 మంది అరెస్టులు జరిగాయి. వీరిలో 22,316 మంది పురుషులు.. 4,838 మంది మహిళలు అరెస్టయిన వారిలో ఉన్నారు.