పాన్ ఇండియా (Pan India) సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం సుమారు అరడజనుకు పైగా సినిమాలు డార్లింగ్ చేతిలో ఉన్నాయి. మరి మీరు కూడా ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా? డార్లింగ్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్ (Spirit) పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికింకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు.. అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga) కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పిరిట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. సెప్టెంబర్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొత్తవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు.
తాజాగా దానికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర బృందం పంచుకుంది. స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారిని డిజిటల్ ఆడిషన్స్‌కి ఆహ్వానించింది. ఈ మేరకు భద్రకాళీ పిక్చర్స్ (Bhadrakali Pictures) ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం నటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా డిజిటల్ ఆడిషన్లను నిర్వహించేందుకు ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా భద్రకాళి పిక్చర్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అందులో, ప్రభాస్ స్పిరిట్ (Prabhas Spirit) సినిమాలో నటించాలనుకునే అభిరుచి గల యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ముఖ్యంగా, 13 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న పురుష నటులు ఈ డిజిటల్ ఆడిషన్లకు అర్హులని వెల్లడించింది. అయితే ఆడిషన్స్‌లో పాల్గోనేవారు పాత్ర కోసం తమ జుట్టు కత్తిరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫొటోలు కూడా పంపించాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో మీ పేరు ఇతర వివరాలు వెల్లడించడంతోపాటు మీ చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని సూచించారు. ఈ మేరకు వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని కోరారు. ఇక ఈ స్పిరిట్ గ్లోబల్ మూవీగా (Global movie) రూపొందుతోంది. దీనిని తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కేల్, యూనివర్సల్ అప్పీల్ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అలరించబోతోంది.