- తమిళనాటలో విజయ్ సింహ గర్జన..
- నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్..
- సింహం సింగిల్ గా వస్తుంది అంటూ రజినీకాంత్ డైలాగ్స్
- నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను విజయ్ ఎదుర్కొగలుగుతాడా..?
- జాతీయ, ప్రాంతియ పార్టీలను TVK ఒంటరిగా ఢీకొడుతుందా..?
- పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న.. లోకల్, నాన్ లోకల్ పార్టీలతో కయ్యం పెట్టుకున్న విజయ్
- విజయ్ దగ్గరున్న పొలిటికల్ వ్యూహాలేంటి..?
- విజయ్ పోటీ వెనుక రహస్యం ఇదే..?
- మధురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు..?
- ఎంజీఆర్, విజయ్ కాంత్ స్థానాన్ని విజయ్ భర్తీ చేయబోతున్నారా..?
- తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకు సక్సెస్ అవుతారు..?
మధురై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలకు పైగా టైం ఉంది. దీంతో తమిళనాడులో అందరి కంటే ముందుగానే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు అనే చెప్పాలి. తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీలకు ఏ మాత్రం స్కొప్ ఇవ్వకుండా.. తన స్టైల్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు.
నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్..

ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ (Tamil Vetri Kalagam Party) రెండో మహానాడు సభ (Mahanadu Sabha) మధురై జిల్లాలో (Madurai District) పెట్టి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అసలు విజయ్ సభకు అసలు ప్రజలు వెళ్తారా.. అన్న ప్రశ్నకు తావు లేకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4 లక్షల మంది సభకు హాజరయ్యారు. కానీ ఇది అంతకు మించి వచ్చినట్లు అంచానలు సైతం ఉన్నాయి. కాగా సభలో TVK పార్టీ చీఫ్ విజయ్ మాత్రం అందరిలాగా కాకుండా.. కాస్త అచి తుచి మాట్లాడారు. సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఓటు బ్యాంక్ గా ఎలా మలుచుకోవాలో.. పక్కా వ్యూహ రచనలు రచించి మరి ప్రసంగాలు చేశారు. ఇక చివరగా.. తమకు బీజేపీ (BJP), డీఎంకే (DMK) రెండూ శత్రువులేనని సభా సాక్షిగా స్పంష్టం చేశారు. బీజేపీ ఐడియాలజీ పరంగా శత్రువైతే.. డీఎంకే రాజకీయ శత్రువు అని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో (2026 Assembly Election) ఒంటరిగానే వస్తానని.. మాతో పొత్తు కోసం ప్రయత్నించే వారికి క్లారిటీ ఇస్తున్నా అంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో మా పోటీ డీఎంకేతోనేనని స్పష్టం చేశారు.
జాతీయ, ప్రాంతియ పార్టీలను TVK ఒంటరిగా ఢీకొడుతుందా..?
వాస్తవాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు విజయ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రశ్నల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో ప్రతిపక్షాలు సైతం తన ప్రశ్నలకు కౌంటర్లు కూడా ఇవ్వలేక పోతున్నారు. ఇలా ప్రసంగం ఇస్తు… ఒక్క సారిగా నేను పోటి చేసేది అక్కడి నుంచే అని విజయ్ ప్రకటించారు. దీంతో అభిమానులు, టీవీకే కార్యకర్తలు, టీవీల్లో చూస్తున్న ప్రజలతో పాటు విజయ్ తో పాటు స్టేజ్ పై ఉన్న నేతలు సైతం షాక్ కి గురయ్యారు. విజయ్ చేసిన ఆ ఒక్క స్టేట్మెంట్ తో అక్కడ ఉన్నవాలందరూ కూడా నోర్లు వెళ్లబెట్టారు.
విజయ్ దగ్గరున్న పొలిటికల్ వ్యూహాలేంటి..?

వచ్చే ఎన్నికల్లో తను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ముందే ప్రకటించారు విజయ్ (Vijay). మధురై ఈస్ట్ అసెంబ్లీ స్థానం (Madurai East Assembl) నుంచి బరిలోకి దిగనున్నట్లు అనౌన్స్ చేశారు. మధురై జిల్లాలో (Madurai District) కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్పి అన్ని నియోజకవర్గాల్లో నేనే పోటి చేస్తున్నా అంటూ ప్రకటించారు. దీంతో అందరు షాక్ కి గురయ్యారు. నిజానికి మధురై జిల్లాలో ఉన్న పది స్థానాల్లో తాను ఎక్కణ్నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే దీని అర్ధం ఈ ఒక్క సారికి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఎమ్మెల్యేలకు నా ఫేస్ చూసి మాత్రమే ఓటు వేయ్యాలని.. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నేనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా గుర్తించి తన పార్టీకి ఓటు విజయ్ ప్రకటించారు. అంటే టీవీకే క్యాడర్ మిగతా 234 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని.. టీవీకే (TVK) కు ఓటు వేస్తే అది తనకు ఓటేసినట్లేనని కార్యకర్తలకు దిశా నిర్ధేశం ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి నియోజకవర్గ మహిళలు అంతా.. ఎంజీఆర్ (MGR)తర్వాత తమను తమ సొంత మనుషుల్లా చూసిన ఒక్క నాయకుడూ లేడని.. ఇప్పుడు విజయ్ తమను అలాగే చూస్తాడని వారు మాట్లాడుకుంటున్నట్లు టీవీకే అధినేత వెల్లడించారు.
మధురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు..?
విజయ్ ఎంచుకున్న మధురై తూర్పు నియోజకవర్గం తమిళనాడు రాజకీయ (Tamil Nadu politics) చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే ‘బెల్‌వెదర్’గా ఈ నియోజక వర్గం పరిగణించబడుతుంది. గతంలో ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీలే చెన్నైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న నమ్మకం బలంగా ఉంది. ఈ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే.. విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే సూచనకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లను సొంతం చేసుకుంటారు, అసలు గెలుస్తారా..? లేదా అన్నది.
ఎంజీఆర్, విజయ్ కాంత్ స్థానాన్ని విజయ్ భర్తీ చేయబోతున్నారా..?
కానీ ఒక్కటి మాత్రం విజయ్ నిజం చేసి చూపించారు. గతంలో విజయ్ పార్టీ పెట్టే ముందు అన్ని మాటలే.. రజినీకాంత్ లాగా ప్రకటనలు చేసి వెళ్లిపోతారు అన్నారు.. సీన్ కట్ చేస్తే.. హీరో విజయ్ తమిళనాటలో విజయ్ పార్టీ పేట్టేశారు. విజయ్ పార్టీ పెట్టాడు గానీ, దాని నడిపించడం వచ్చా.. అసలు ఒక్క సభ అయిన పెట్టి సక్సెస్ చేస్తాడా అన్నారు. అది కూడా విజయ్ నిజం చేసి చూపించారు. అసలు తమిళనాడు రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా ఉన్నా మధురై జిల్లా విజయ్ సభ పెట్టి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. దీంతో తమిళనాడు తో పాటు యావత్ దేశం సైతం విజయ్ తన వైపు తిప్పుకునేలా చేశాడు.