హైదరాబాద్… ప్రస్తుతం ఈ నగరం తెలియని వాళ్లు అంటూ ఉండరేమో. భారత దేశ ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలిసిన విశ్వ నగరం. ప్రపంచ పటంలో న్యూయార్క్, సిడ్నీ, ఢిల్లీ, టోక్యో, వంటి నగరాల సరసన చోటు సంపాదించుకొని తన మార్క్ ని చాటుకున్న మహా నగరం. ఇంకొక్క రంకంగా చెప్పాలంటే హైదరాబాద్ ని అక్షయ పాత్ర అని అంటుంటారు. అలా అనడమే కాదు అదే వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న.. రాష్ట్రాల వాళ్ళందరు కూడా హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచింది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ బతకడానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. పంజాబ్ సిక్కులతో మొదలు పెడితే.. కేరళ వరకు అందరిని కూడా హైదరాబాద్ జీతంతో జీవితాన్ని ఇస్తుంది. రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణలో బతుకుతున్నారు. తెలంగాణ కేంద్రంగా వార్తల వ్యాపారాలను అంతకంతకు విస్తరించారు. ఇప్పుడు ఇదే.. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. బతువుదెరుకు కోసం వచ్చిన ఒక వర్గం ఇప్పుడు ఏకంగా.. తమ పొట్ట కొట్టారంటు రొడ్డెక్కారు.
తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’
ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తుంది. ఏంటి ఆ ఉద్యమం అని డౌట్ వస్తుందా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..! అవును మీరు విన్నది నిజమే.. నిజంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మార్వాడి ఉద్యమం నడుస్తుంది. వాస్తవానికి ఆంధ్ర వారి కంటే కూడా తెలంగాణలో మార్వాడి వారికే ఎక్కువగా వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే అమీర్పేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాలలో మార్వాడీలు అధికంగా విస్తరించారు. మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు. వీరిలో ప్రధానంగా మిఠాయి దుకాణాలు కొనసాగించేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. ఇక్కడ కుటుంబాలకు కుటుంబాలుగా ఏర్పడి.. ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సాధించారు. నిజానికి మార్వాడి వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు. అయితే ఇటీవల కాలంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్నవారు ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో మార్వాడి వ్యాపారులకు స్థానిక వ్యాపారులకు వాగ్వాదాలు జరిగాయి. సోషల్ మీడియా వల్ల ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. నీతో ఏకంగా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా.. వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
బంద్ కు పిలుపు..
తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతంలో బంద్ కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు మార్వాడి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మార్వాడిల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని.. వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. అంతేకాదు ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అమనగల్లు ప్రాంతంలో బంద్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అనే యాష్ ట్యాగ్ విపరీతమైన ట్రెండ్ లో ఉంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
‘మార్వాడీ గో బ్యాక్’
ఇక ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. భారతీయులు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు కలిగి ఉంటారని అన్నారు. తెలంగాణకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ దేశానికి చెందిన మార్వాడీలను గో బ్యాక్ అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఇతర దేశాలకు చెందిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రోహింగ్యాలు ఎంతోమంది పాతబస్తీని అడ్డాగా చేసుకున్నారని అన్నారు.