రాఖీ… అన్న, చెల్లల్ల అనుంబానికి అతి పవిత్రమైన రోజు. ఎప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుందా.. ఎప్పుడెప్పుడు వెళ్లి అన్నకి గానో, తమ్ముడికి గానో రాఖీ కడుదామా అని చాలా మంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. ఇక ఈ రక్షాబంధన్ కే.. సంవత్సరాలుగా మాట్లాడుకొని అన్నా చెల్లెలు కూడా ఈ రోజు మాట్లాడుకుంటారు. అయితే.. ప్రతి సారి రాఖీ పండుగ విషయంలో మహిళలకు ఒక చిన్న సందేహం ఉంటుంది. రాఖీ ఎప్పుడు కట్టాలి, ఏ సమయంలో కట్టాలి అని అలాంటి వాళ్ల కోసమే ఈ వీడియో.
ఇక ఈ సారి రాఖీ పండుగ శనివారం రోజున వస్తుంది. ఆ రోజు ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటల లోపు రాఖీ కట్టేందుకు శుభసమయం అని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రి 7:19 నుంచి 9:24 గంటల వరకు కట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాఖీ కట్టే ముందు సోదరుడి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత రాఖీని కట్టడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే, రాఖీ కట్టేటప్పుడు సోదరుడికి ఎదురుగా కూర్చొని కట్టడం శుభప్రదంగా భావిస్తారు.