Do you know what are the upcoming movies from Tollywood for Sankranti 2026?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటే ఎంతో ప్రత్యేకం.. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ కి సంక్రాంతికి మించిన మరే సిని దొరకదనే చెప్పాలి. అంటే యావరేజ్ సినిమాని సైతం హిట్ చేసే సీజన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.

వచ్చే సంక్రాంతి మనదే…!

మామూలు సీజ‌న్‌లో విడుద‌ల చేస్తే వ‌చ్చే క‌ల‌క్ష‌న్ కంటే, సంక్రాంతికి వచ్చే సినిమాల వ‌సూళ్లు డ‌బుల్ ఉంటాయి. అందుకే టాలీవుడ్ చోటా, బడా నిర్మాతాలంతా కూడా సంక్రాంతిపైనే గురి పెడుతుంటారు. ఇక 2026 సంక్రాంతికి అప్పుడే బెర్తులు నిండుకొన్నాయి అనే చెప్పాలి. వ‌చ్చే సీజ‌న్‌లో 4 సినిమాలు రాబోతున్నాయి. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా సంక్రాంతికి రావ‌డం ప‌క్కా అయిన‌ట్టే. న‌వీన్ పొలిశెట్టి ‘అన‌గ‌న‌గా ఒక‌రాజు’ సినిమానీ సంక్రాంతినే టార్గెట్ చేసుకొని రెడీ చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి నుంచే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేస్తున్నారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న మాస్ రాజా.. తన తదుపరి చిత్రాని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేస్తున్నాడు.

సంక్రాంతి రేస్లో ఎంత మంది ఉన్నారో తెలుసా…?

తాజాగా ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా రవితేజకు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీంతో వచ్చే సంక్రాంతి వార్ మెగాస్టార్ వర్సెస్ రవితేజగా మారనుందనే చెప్పాలి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేలా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు రవితేజ సినిమా కూడా సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది. ఇదే కాకుండా మరో వైపు ర‌వితేజ – కిషోర్ తిరుమ‌ల కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘అనార్క‌లి’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమానీ 2026 సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అంటే ఇప్ప‌టికి మూడు సినిమాలు వ‌స్తున్నాయ‌న్న‌మాట‌. త‌మిళం నుంచి విజ‌య్ సినిమా ఒక‌టి ఈ పండ‌క్కే విడుద‌ల కానుంది. అంటే మొత్తంగా క‌లిపి నాలుగు సినిమాల‌య్యాయి. మున్ముందు ఇంకెన్ని సినిమాలు రేసులో ఉంటాయో తెలియ‌డం లేదు. ఎలా చూసినా 4-5 సినిమాలు రావ‌డం గ్యారెంటీ. సంక్రాంతి కాబ‌ట్టి ఎన్ని సినిమాలొచ్చినా.. ఛాన్స్ ఉంటుంది. కాక‌పోతే బ‌డా స్టార్ సినిమా అంటే అది చిరు – అనిల్ కాంబోనే. చిరు సినిమాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్త‌య్యింది. మ‌రో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ర‌వితేజ సినిమా ఈమ‌ధ్యే ప‌ట్టాలెక్కింది. న‌వీన్ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఏది ఏమైనా వచ్చే సంక్రాంతికి కూడా పండగ వాతావరణం ఉండేట్లు. ఇక మీరు ఏ సినిమా గురించి వేట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయ్యండి.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *