సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!
గత కొన్ని నెలల నుంచి ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి! ఆగస్టు నెలలో రిలీజైన కూలి, WAR 2 వంటి పెద్ద సినిమాల ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ పైనే ఉంది. మరి ఈసారైనా ఫ్యాన్స్ అంచనాలను సినిమాలు అందుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరి ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం రండి.
సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. సెప్టెంబర్ 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. సెప్టెంబర్ 25న విడుదల కానుండగా, బాలయ్య అఖండ 2 మూవీపై క్లారిటీ రావలసి ఉంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నవంబర్ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లేదు.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పాన్ ఇండియా ప్రభాస్ రాజా సాబ్ తో థియేటర్స్ లోకి రానున్నారు. ఇక క్రిస్మస్ స్పెషల్ గా యంగ్ హీరో అడివి శేష్ డెకాయిట్ తో పాటు అవతార్-3 చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి.ఈ లిస్ట్‌లో మరి కొన్ని సినిమాలు యాడ్ అవుతాయి. అయితే ఏ సినిమాకు బ్లాక్‌బస్టర్ ట్యాగ్ దక్కుతుందో చూడాలి.