దేవ్ భూమి లో ప్రళయం..
దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు గ్రామస్థులు చిక్కుకుపోయారు. ఈ వరదల్లో గ్రామానిక గ్రామం భూస్థాపితం కాగా.. 50 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రస్తుతం వాళ్ల ఆచూకీ కి సంబంధించిన ఆనవాలు దొరకడం లేదని తెలిపిన రెస్క్యూ టీం.

ఉప్పొంగిన ఖీర్ గంగా నది..
ఖీర్‌గంగా నది ఉప్పొంగి పక్కనే ఉన్న గ్రామాలను ముంచెత్తడంతో అనేక ఇళ్లు శిథిలమయ్యాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నెట్టింట వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. గ్రామస్థులు భయాందోళనతో అరుస్తూ పరుగులు తీస్తుండటం వీడియోల్లో కనిపిస్తుంది. ఇదే ఆగస్టు 15 2012 లో ఇదే గ్రామంపై మెరుపు వరదలు సంభవించాయి. అంటే దాదాపు పుష్కర కాలం తర్వాత ఉత్తర కాశీ, ధరాలి గ్రామం పై ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆ ఘటనలో దాదాపు 50 మందికి పైగా మరణించారు.
ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం..
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో హరిద్వార్‌లో గంగా సహా అనేక ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సోమవారం రుద్రప్రయాగ్ జిల్లాల్లో కురిసిన వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియల విరిగిపడి.. రాళ్లు, మట్టితో షాపులు పూర్తిగా కూరుకుపోయాయి. అంతకుముందు రోజు ఆదివారం నాడు ఉద్ధమమ్ సింగ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు లేవ్డా, దాని ఉపనదులు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రాంపూర్-నైనిటాల్ ప్రధాన రహదారి, చకర్పూర్, లఖన్‌పూర్, పిస్టోర్, బర్హైని గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మరో వైపు కేధార్నాథ్ యాత్ర లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేధర్నాథ్ కు వెళ్ల భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గత వారంలో కేధార్నాథ్ లోని గౌరి కుండ్ ప్రాంతాల్లో.. భారీగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 2 ప్రాణాలు కొల్పోయారు. అది మరవకు ముందే సోన్ ప్రయాగ్ లో మరో సారి కొంచరియలు విరిగిపడ్డాయి.
సీఎం ఆందోళన..
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉత్తర కాశీలోని ధరాలి ప్రాంతంలో ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త చాలా బాధాకరం.. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలు సహాయ, రక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్నాయి… సీనియర్ అధికారులతో నిరంతర సమన్వయం చేసుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నాం.. అక్కడి ప్రజల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్ ( ట్విట్టర్)లో ధామి పోస్ట్ చేశారు.